https://oktelugu.com/

రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు మోదీ సర్కార్ శుభవార్త?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డు ద్వారా ఇచ్చే సరుకుల గురించి క్యూ లైన్ లో నిలబడకుండా ఇంటి నుండే సులువుగా తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా కేంద్రం రేషన్ సరుకులకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. Also Read: కేంద్రం శుభవార్త.. వాళ్లందరికీ పన్ను మినహాయింపు? కేంద్రం రేషన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 2, 2021 / 08:14 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డు ద్వారా ఇచ్చే సరుకుల గురించి క్యూ లైన్ లో నిలబడకుండా ఇంటి నుండే సులువుగా తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా కేంద్రం రేషన్ సరుకులకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది.

    Also Read: కేంద్రం శుభవార్త.. వాళ్లందరికీ పన్ను మినహాయింపు?

    కేంద్రం రేషన్ కార్డుదారులు దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకోవాలనే ఉద్దేశంతో వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారుల కోసం మేరా రేషన్ అనే యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకునే వాళ్లు రేషన్ దుకాణంలో ఇచ్చే సరుకులకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర వివరాలను కూడా సులభంగా తెలుసుకోవచ్చు.

    రేషన్ కార్డుదారులు ఆధార్ కార్డు సహాయంతో లేదా రేషన్ కార్డ్ నంబర్ సహాయంతో ఈ యాప్ లో సులువుగా లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యాప్ సహాయంతో రేషన్ కు సంబంధించిన కచ్చితమైన సమచారంతో పాటు ఎంత కోటా ధాన్యం లభిస్తుందనే వివరాలను తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగుతో పాటు 14 భాషల్లో మేరా రేషన్ యాప్ అందుబాటులో ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వాళ్లకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

    Also Read: తక్కువ ధరకు బైక్ కొనేవాళ్లకు షాకింగ్ న్యూస్?

    కేంద్రం రేషన్ కార్డులు కలిగి ఉన్న 81 కోట్ల మందికి రేషన్
    సరుకుల ద్వారా ప్రయోజనం చేకూర్చుతోంది. కేంద్రం రేషన్ సరుకులకు సబ్సిడీకి అందిస్తుండటంతో రేషన్ కార్డుదారులు తక్కువ ధరకే సరుకులను పొందే అవకాశం ఉంటుంది.