బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చింది. అజయ్ దేవ్ గణ్ పాత్రను తెలియజేసేలా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది.
రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం అజయ్ దేవగణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం ఈ స్పెసల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. వైరల్ అవుతోంది.
రాజమౌళి మార్క్ సెన్షేషన్ ఈ వీడియోలో కనిపించింది. బ్రిటీష్ సైనికులకు ఎదురునిలుస్తున్న యోధుడిగా అజయ్ దేవగణ్ కనిపించారు. వారి బుల్లెట్లకు ఎదురొడ్డి వీరత్వంతో నిలబడే ధీరుడిగా వీడియోలో అద్భుతంగా చూపించారు.
రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇటీవలే సీతగా ఆలియా భట్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ విడుదల కాగా.. ఈరోజు అజయ్ దేవ్ గణ్ కు అదిరిపోయే రీతిలో రాజమౌళి వీడియో విడుదల చేసి పెను సంచలనం సృష్టించారు.