తిరుపతిలో ‘హోదా’ వర్కవుట్ అవుద్దా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆ రాష్ట్రం కేంద్రాన్ని ఎప్పటి నుంచో కోరుతోంది. కానీ.. కేంద్రం మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అంతేకాదు ఇటీవల.. ప్రత్యేక హోదా ఇవ్వడం వీలుకాదంటూ తేల్చేసింది కూడా. అయితే.. ఇప్పుడు ఎన్నికల జరుగుతున్న పుదుచ్చేరికి మాత్రం ప్రత్యేక హోదా ఇస్తామంటూ బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇది కాస్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీని కార్నర్ చేయడానికి టీడీపీతోపాటు కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డిలాంటి కొంత […]

Written By: Srinivas, Updated On : April 2, 2021 12:24 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆ రాష్ట్రం కేంద్రాన్ని ఎప్పటి నుంచో కోరుతోంది. కానీ.. కేంద్రం మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అంతేకాదు ఇటీవల.. ప్రత్యేక హోదా ఇవ్వడం వీలుకాదంటూ తేల్చేసింది కూడా. అయితే.. ఇప్పుడు ఎన్నికల జరుగుతున్న పుదుచ్చేరికి మాత్రం ప్రత్యేక హోదా ఇస్తామంటూ బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇది కాస్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

బీజేపీని కార్నర్ చేయడానికి టీడీపీతోపాటు కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డిలాంటి కొంత మంది నేతలు.. పుదుచ్చేరి మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం లేదని కొత్తగా వాదించడానికి ప్రయత్నించారు. కానీ.. మేనిఫెస్టో కాపీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు.

అయితే.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సమయంలోనే పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పెట్టడం.. వైసీపీకి కూడా ఇబ్బందికరంగా మారింది. దీనిపై ప్రశ్నించలేని దశకు వైసీపీ చేరిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీజేపీ విధానంపై ఆ పార్టీ ఏపీ నేతలు సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీ నేతలు కూడా గళం విప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. వారు ఇప్పటికీ మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తిలోని బలిజ ఓటర్ల ద్వారా ఓట్లు వేయించుకోవాలన్న ఎత్తుగడలో ఉన్న బీజేపీకి పుదుచ్చేరి ప్రత్యేక హోదా అంశం ఇబ్బందికరంగానే మారింది.

అటు ప్రత్యేక హోదా అంశంపైనా.. ఇటు పుదుచ్చేరి అంశంపైనా టీడీపీ వైసీపీ, జనసేనలను నిందిస్తోంది. ఆ రెండు పార్టీలూ స్పందించాలంటూ డిమాండ్‌ చేస్తోంది. కానీ.. వారు ఆ విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ప్రజలు కూడా.. సీరియస్‌గా తీసుకుంటున్న సూచనలు కనిపించడం లేదు. దీంతో హోదా అంశంపై ఎంతగా రచ్చ చేసినా.. టీడీపీకి పెద్దగా వచ్చే మైలేజీ ఏమీ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే.. భవిష్యత్‌లో అయినా బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు ప్రజల్లో చర్చకు వస్తాయని.. అప్పుడు ఇలాంటివన్నీ తీవ్ర ప్రభావం చూపిస్తాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా తిరుపతి ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకొని అటు వైసీపీ, ఇటు బీజేపీ–జనసేన కూటమిలను ఇబ్బంది పెట్టాలన్న బాబు దుర్బుద్ధి వర్కవుట్‌ అయ్యేలా కనిపించడం లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్