https://oktelugu.com/

డిజిటల్ డెబ్యూకు సిద్ధమవున్న ఐశ్వర్యరాయ్..!

మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాలు చేసే ప్రేక్షుకుడి టేస్ట్ కూడా మారుతోంది. ఒకప్పుడు థియేటర్లలో.. టీవీల్లో సినిమాలు చూసే వాళ్లంతా నేడు ఓటీటీలకు.. వెబ్ సీరిసులకు బాగా అలవాటు పడిపోయారు. Also Read: హాలీవుడ్ మూవీలో అలరించబోతున్న ధనుష్ కరోనా పుణ్యమా అని ఓటీటీల బిజినెస్ మూడుపువ్వులు.. ఆరుకాయలు అన్నచందంగా మారింది. సినిమాను మించే కంటెంట్ తో వెబ్ సీరిసు నిర్మిస్తూ ఓవర్గం ప్రేక్షకులను ఓటీటీలు కట్టిపడేస్తున్నాయి. దీనికితోడు ఇటీవల థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలన్నీ కూడా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 18, 2020 / 07:35 PM IST
    Follow us on

    మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాలు చేసే ప్రేక్షుకుడి టేస్ట్ కూడా మారుతోంది. ఒకప్పుడు థియేటర్లలో.. టీవీల్లో సినిమాలు చూసే వాళ్లంతా నేడు ఓటీటీలకు.. వెబ్ సీరిసులకు బాగా అలవాటు పడిపోయారు.

    Also Read: హాలీవుడ్ మూవీలో అలరించబోతున్న ధనుష్

    కరోనా పుణ్యమా అని ఓటీటీల బిజినెస్ మూడుపువ్వులు.. ఆరుకాయలు అన్నచందంగా మారింది. సినిమాను మించే కంటెంట్ తో వెబ్ సీరిసు నిర్మిస్తూ ఓవర్గం ప్రేక్షకులను ఓటీటీలు కట్టిపడేస్తున్నాయి.

    దీనికితోడు ఇటీవల థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలన్నీ కూడా ఓటీటీల్లోనే రిలీజవుతున్నాయి. ఇకప్రముఖ ఓటీటీలు నిర్మించే వెబ్ సీరిసుల్లో ఇప్పటికే చాలామంది స్టార్లు ఎంట్రీ ఇచ్చి ఈ రంగంలోనూ సత్తా చాటుతున్నారు.

    ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన సైఫ్ అలీఖాన్.. అనిల్ కపూర్.. షాహీద్ కపూర్.. శ్రద్ధాకపూర్ లాంటి స్టార్స్ డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే అభిషేక్ బచ్చన్ సైతం ‘బ్రీత్-2’ సిరీసు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

    Also Read: కరణ్ జోహార్ మెడకు డ్రగ్స్ కేసు… ఆ స్టార్స్ గుండెల్లో రైళ్లు!

    తాజాగా మాజీ మిస్ ఇండియా.. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్ రాయ్ సైతం తన భర్త అడుజాడల్లో నడుస్తూ డిజిటల్ డెబ్ల్యూకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫిక్స్ సంస్థ నిర్మించే వెబ్ సిరీసులో ఐశ్వర్య రాయ్ నటించనుందనే బీటౌన్లో ప్రచారం జరుగుతోంది.

    లాక్డౌన్ సమయంలోనే ఐశ్వర్ రాయ్ తో నిర్మించే వెబ్ సిరీసుకు సంబంధించిన పలు స్క్రీప్టులు నెట్ ఫ్లిక్స్ సంస్థ విన్పించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఒకటి రెండు సినిమాల్లో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.

    త్వరలోనే దీనిపై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతుందని సమాచారం. మొత్తానికి ఐశ్వర్యరాయ్ సైతం డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్