
రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తున్నదని అన్నారు. రూ.600 కోట్లు ఖర్చుచేసి రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికలను నిర్మించామని తెలిపారు. సాగుకు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ అధిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని అన్నారు.