కరోనా కారణమో..? లేక సంక్షేమ పథకాల సంక్షోభమో..? తెలియదు గానీ, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకున్నాయి. ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ కూడా ఇపుడు పీకల్లోతు అప్పుల్లో కూరుకునిపోయింది. గత 2018-19 తో పోలిస్తే గతేడాది తెలంగాణపై అప్పుల భారం 38 శాతం పెరగ్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై 42 శాతం పెరిగింది.
తెలంగాణరాష్ట్రం ఈ యేడాది ఇప్పటివరకు తీసుకున్న దానిని బట్టి మొత్తం ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణం రూ.48 వేల కోట్లకు, నికర రుణం రూ.40,500 కోట్లకు చేరే అవకాశం ఉంది.
అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించిన స్థూల రుణం 42.10 శాతం, నికర రుణం 42.47 శాతం పెరిగింది.
ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నెలకు సగటున రూ.3,333 కోట్ల చొప్పున రూ.10 వేల కోట్ల స్థూల రుణం తీసుకోగా, ఇందులో నికర రుణం వాటా రూ.8,250 కోట్లుగా ఉంది.