https://oktelugu.com/

వినూత్నం.. లంచం ఇచ్చేందుకు బిక్షాటన చేస్తున్న యువరైతు..!

ఆ యువకుడికి వ్యవసాయం మంటే ఎంతో ఇష్టం.. ఉన్నత విద్యను అభ్యసించినా.. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నాడు. తనకున్న ఎనిమిదెకరాల భూమిలో వ్యవసాయం చేయాలని తలంచాడు. అయితే ఆ భూమి వివాదంలో చిక్కుకోగా పరిష్కారించాల్సిన రెవిన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండంతో ఆ యువరైతు వినూత్నంగా నిరసన తెలుపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. Also Read: వినూత్నం.. లంచం ఇచ్చేందుకు బిక్షాటన చేస్తున్న యువరైతు..! మంచిర్యాల జిల్లా తాండూర్ గ్రామానికి చెందిన యువ‌రైతు తౌటం రాజేంద్ర‌ప్రసాద్ కు చెందిన భూమి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 27, 2020 / 11:19 AM IST
    Follow us on

    ఆ యువకుడికి వ్యవసాయం మంటే ఎంతో ఇష్టం.. ఉన్నత విద్యను అభ్యసించినా.. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నాడు. తనకున్న ఎనిమిదెకరాల భూమిలో వ్యవసాయం చేయాలని తలంచాడు. అయితే ఆ భూమి వివాదంలో చిక్కుకోగా పరిష్కారించాల్సిన రెవిన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండంతో ఆ యువరైతు వినూత్నంగా నిరసన తెలుపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

    Also Read: వినూత్నం.. లంచం ఇచ్చేందుకు బిక్షాటన చేస్తున్న యువరైతు..!

    మంచిర్యాల జిల్లా తాండూర్ గ్రామానికి చెందిన యువ‌రైతు తౌటం రాజేంద్ర‌ప్రసాద్ కు చెందిన భూమి విషయంలో వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. తన భూ సమస్యను పరిష్కరించాలని రెవిన్యూ అధికారుల కాళ్లవేళ్లా తిరిగిన పట్టించుకోకపోవడంతో.. అధికారులకు లంచం ఇస్తేనన్న పని చేస్తారనే ఉద్దేశ్యంతో ఆ యువరైతు బిక్షాటన చేస్తూ ప్రభుత్వం దృష్టికి తన సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

    రాజేంద్ర ప్రసాద్ కథనం ప్రకారం.. తాండూర్‌ శివారులోని 612/అ/5, 612/5/అ సర్వే నెంబర్లలో ఎనిమిది ఎకరాల భూమికి సంబంధించి అన్ని ర‌కాల ప‌త్రాలు ఉన్నాయని చెబుతున్నాడు. తనకు ఓ వైపు క‌బ్జాదారుల బెదిరింపులు వస్తుండగా మరోవైపు తనకు తెలియకుండా ఆన్ లైన్ లో భూమార్పిడి జరిగిదంటూ రైతు ఆరోపిస్తున్నాడు.ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఫలితం రాలేదని బాధితుడు వాపోతున్నాడు.

    యువరైతు భూమి విషయంలో రెవిన్యూ అధికారుల వివరణ మరోలా ఉంది. రైతు భూమి వివాదంలో ఉందని.. సంబంధిత నివేదిక‌లు త‌యారు చేసి ఉన్న‌తాధికారుల‌కు పంపించినట్లు చెబుతున్నారు. వివాదంలో ఉన్న భూములు ధరణి వెబ్‌సైట్‌లో కేటగిరి పార్టు-బి లో ఉండడంతో బాధితుడు సమస్య పరిష్కరం కావడం లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం.

    Also Read: రాయలసీమ ఎత్తిపోతలకు లైన్‌ క్లియర్‌‌

    ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధరణి’తో రైతులకు సంబంధించిన భూ సమస్యలు తీరుతాయనుకుంటే మరిన్ని సమస్యలు వస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. యువరైతు మాత్రం రెవిన్యూ అధికారులకు లంచం ఇస్తే పని జరుగుతుందని బిక్షాటన చేస్తుండటం రెవిన్యూ అధికారులు పనితీరుకు నిదర్శనంగా మారింది.

    వేలవేల జీతాలు తీసుకునే రెవిన్యూ అధికారులకు రైతుల నుంచి లంచాలు తీసుకుంటేగానీ ఇల్లు గడువాదా? అని పలువురు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. సీఎం కేసీఆర్ రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ఎంత నడుంబిగించిన అధికారుల తీరులో మార్పురాకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు యథావిధిగానే కొనసాగుతుండటం శోచనీయంగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్