
మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ సినిమా విజయవంతం అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ఇదివరకు విడుదల చేశారు. కాగా ఢీ సినిమాలో మంచు విష్ణుకు తోడుగా జెనిలియా అలరించింది. దీంతో ఢీ2లో ఎవరనే విషయంపై ఆసక్తి పెరిగింది. అయితే ‘ఢీ2’లో ఇద్దరు నటీమణులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణుకు జోడీగా ఇద్దరు హీరోయిన్లను జత చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ఇద్దరు ఎవరన్న విషయం మాత్రం చిత్రం యూనిట్ సస్పెన్ష్ లో ఉంచింది.