కరోనా రోగులకు మరో షాక్.. పేగుల్లో ఆ సమస్య..?

సాధారణంగా ఏ వ్యాధికైనా ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. అయితే కరోనా వైరస్ సోకిన వాళ్లలో మాత్రం వేర్వేరు లక్షణాలు కనిపిస్తున్నాయి. గుండె, మెదడు, కాళ్లలో రక్తం గడ్డలు కట్టడం గురించి మనం తరచూ వింటూ ఉంటాం. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లలో పేగుల్లో కూడా రక్తం గడ్డలు కడుతోంది. ముంబైలో భారీ సంఖ్యలో ఈ తరహా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. కడుపులో భరించలేనంత నొప్పి వస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. […]

Written By: Navya, Updated On : June 4, 2021 9:56 am
Follow us on

సాధారణంగా ఏ వ్యాధికైనా ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. అయితే కరోనా వైరస్ సోకిన వాళ్లలో మాత్రం వేర్వేరు లక్షణాలు కనిపిస్తున్నాయి. గుండె, మెదడు, కాళ్లలో రక్తం గడ్డలు కట్టడం గురించి మనం తరచూ వింటూ ఉంటాం. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లలో పేగుల్లో కూడా రక్తం గడ్డలు కడుతోంది. ముంబైలో భారీ సంఖ్యలో ఈ తరహా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. కడుపులో భరించలేనంత నొప్పి వస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ముంబైకు చెందిన 59 సంవత్సరాల వయస్సు గల సునీల్‌ గవాలీ అనే వ్యక్తికి భోజనం చేసిన తరువాత కడుపునొప్పి ప్రారంభమైంది. సునీల్ గవాలీ అప్పటికే రెండు డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వైద్యులు సీటీ స్కాన్ చేయగా పేగులకు రక్తం సరఫరా చేసే ప్రధాన ధమనుల్లో చాలా చోట్ల రక్తం గడ్డలు కట్టినట్టు తేలింది. తక్షణమే చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ధమనుల్లో గడ్డలు కట్టిన రక్తాన్ని మందులతో కరిగించామని కరోనా పరీక్ష చేయగా సునీల్ గవాలీకి పాజిటివ్ వచ్చిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్, పేగుల్లో రక్తం గడ్డకట్టడం లాంటి కేసులను ఇప్పటివరకు తొమ్మిది మందిలో గుర్తించామని వైద్య నిపుణులు తెలిపారు. కేవలం తీవ్రమైన కడుపు నొప్పితోనే వీళ్లు ఆస్పత్రిలొ చేరారని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.

కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండటంతో ఎలాంటి కొత్త లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. సరైన సమయంలో వైద్య చికిత్స చేయించుకుంటే మాత్రమే ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది.