
మనలో చాలామంది డబ్బు ఆదా చేయాలని ఆదా చేసిన డబ్బు ద్వారా భవిష్యత్తులో ప్రశాంతంగా జీవించాలని భావిస్తూ ఉంటారు. అయితే డబ్బును ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఎక్కువ లాభాలు పొందుతామో అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొందరు సరైన విధంగా పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు. మనం సంపాదించడం మొదలుపెట్టిన తరువాత ఇన్వెస్ట్‌మెంట్లను ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టపోతాము.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా చిన్న వయస్సులో ఇన్వెస్ట్‌మెంట్లను మొదలుపెడితే భవిష్యత్తులో అదిరిపోయే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం పెద్దగా లేనివారు భారీ మొత్తంతో కాకపోయినా తక్కువ మొత్తంతో ఇన్వెస్ట్‌మెంట్లను ప్రారంభిస్తే కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. పెట్టుబడి పెట్టి దీర్ఘకాలం లాభాల కోసం వేచి చూసే ఓపిక ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే రిటైర్మెంట్ సమయానికి కోటి రూపాయలకు పైగా సంపాదించే అవకాశం ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఆలస్యంగా ప్రారంభిస్తే మాత్రం లక్షలు మాత్రమే సొంతమవుతాయి. వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే మంచిది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మిగతా స్కీమ్ లతో పోలిస్తే రాబడి అధికంగా ఉంటుంది. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకున్న తరువాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. సరైన విధంగా పెట్టుబడులు పెడితే ఎక్కువ సమయంలో తక్కువ మొత్తంతో ఊహించని లాభాలను సొంతం చేసుకోవచ్చు.