
కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం అలుముకుంది.ప్రముఖ దర్శకుడు షాహురాజ్ షిండే గుండెపోటుతో మృతి చెందారు. 2007లో కన్నడలో వచ్చిన దర్శన్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రీతి స్నేహన, ప్రేమ చంద్రమా, అర్జున్ సినిమాలకు డైరెక్టర్ గా పనిచేశారు. అలాగే 2019లో తీసిన రంగ మందిర్ సినిమాతో హీరోగా కూడా పరిచయమయ్యారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. షాహురాజ్ మరణ వార్త తెలుసుకున్న కన్నడ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనయింది. ఇక కన్నడ నిర్మాత అశుబేద్రా, సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ షాహురాజ్ లేడనే విషయం తెలియగానే కన్నీరుమున్నీరవుతున్నారు.