https://oktelugu.com/

బీహార్‌‌ సంకీర్ణంలో అప్పుడే లుకలుకలు..!

ఎంతో టెన్షన్‌.. మరెన్నో సస్పెన్స్‌ల మధ్య బీహార్‌‌ ఎన్నికలు ముగిశాయి. ఎవరూ ఊహించని విధంగా.. సర్వేలను సైతం బోల్తా కొట్టించేలా బీజేపీ–జేడీయూల కూటమి గెలుపు జెండా ఎగురవేసింది. మరోసారి జేడీయూ నేత నితీష్‌ కుమార్‌‌ సీఎం సీటును అధిరోహించారు. అయితే.. ఇప్పుడు అధికార పార్టీలో అసంతృప్తి కనిపిస్తోందట. ఆ అసంతృప్తి సొంత పార్టీపైన కాదట.. మిత్రపక్షమైన బీజేపీ మీద. ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కమార్ ఉన్నప్పటికీ బీజేపీపై ఆయన విశ్వాసంతో లేరు. బీజేపీతో కలిసి తాను […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 19, 2021 / 10:14 AM IST
    Follow us on


    ఎంతో టెన్షన్‌.. మరెన్నో సస్పెన్స్‌ల మధ్య బీహార్‌‌ ఎన్నికలు ముగిశాయి. ఎవరూ ఊహించని విధంగా.. సర్వేలను సైతం బోల్తా కొట్టించేలా బీజేపీ–జేడీయూల కూటమి గెలుపు జెండా ఎగురవేసింది. మరోసారి జేడీయూ నేత నితీష్‌ కుమార్‌‌ సీఎం సీటును అధిరోహించారు. అయితే.. ఇప్పుడు అధికార పార్టీలో అసంతృప్తి కనిపిస్తోందట. ఆ అసంతృప్తి సొంత పార్టీపైన కాదట.. మిత్రపక్షమైన బీజేపీ మీద. ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కమార్ ఉన్నప్పటికీ బీజేపీపై ఆయన విశ్వాసంతో లేరు. బీజేపీతో కలిసి తాను పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేనని ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా అర్థమవుతోంది.

    Also Read: పాన్ కార్డ్ లేనివారికి శుభవార్త.. పదినిమిషాల్లో పాన్ కార్డు పొందే ఛాన్స్..?

    ఈ సారి ఎన్నికల్లో జేడీయూ పెద్దగా చెప్పుకోదగ్గ సీట్లు రాలేదు. తక్కువ సీట్లే వచ్చాయి. అయితే.. ఇందుకు కారణం కూడా బీజేపీయేనని అంటున్నారు ఓటమి పాలైన నేతలు. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కారు. తమ ఓటమికి ప్రధాన కారణం బీజేపీయేనని వారు నిందలు వేశారు. బీజేపీ సహకరించలేదని ఆరోపిస్తున్నారు.

    వాస్తవానికి చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ వల్ల ఓటమి పాలైందని తొలుత అందరూ భావించారు. ఎల్జేపీ కేవలం జేడీయూ పోటీ చేసిన స్థానాల్లోనే బరిలోకి దిగింది. దీంతో తమను ఓడించానికి ఎల్జేపీ ప్రయత్నిస్తుందని భావించిన జేడీయూ నేతలు ఆ ఓటు బ్యాంకుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ బీజేపీ ఓటు బ్యాంకు కూడా తమకు టర్న్ కాలేదని ఎన్నికల అనంతరం జరిగిన విశ్లేషణలో తేల్చారు.

    Also Read: జగన్ కు ఇది ఊహించని పరిణామం

    ఎన్నికలకు ముందు నుంచే జేడీయూ నేతలకు బీజేపీపై నమ్మకం లేదు. లోక్ జనశక్తి పార్టీ బయటకు వెళ్లి తమపై పోటీ చేస్తామని ప్రకటించడం, అదే సమయంలో మోదీని, బీజేపీని చిరాగ్ పాశ్వాన్ పొగడటం వంటి వాటిపై బీజేపీ నేతలు పెద్దగా స్పందించలేదు. చిరాగ్ వల్ల నష్టం జరగలేదని, బీజేపీ వల్లనే తమకు ఎక్కువ నష్టం జరిగిందని వారు చెబుతున్నారు. బీజేపీ ఓటు బ్యాంకును లోక్ జనశక్తి పార్టీకి వెళ్లడంతోనే తాము ఓటమిపాలయ్యామంటున్నారు. మొత్తంగా చూస్తే బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు ప్రారంభమైనట్లుగా అర్థమవుతోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్