https://oktelugu.com/

ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్.. రద్దుయేనా?

హోరాహోరాగా సాగుతున్న ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ఒక రాష్ట్రం వల్ల అంతా గందరగోళం నెలకొంటోంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదికగా ఈనెల 15 నుంచి నాలుగో టెస్ట్ జరుగనుంది. అయితే బ్రిస్బేన్ ఉన్న క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలో కరోనా కఠిన నిబంధనలు ఉన్నాయి. తాజాగా అక్కడ మూడు రోజుల పాటు లాక్ డౌన్ కూడా విధించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సిడ్నీ నుంచి భారత ఆటగాళ్లు, ఆస్ట్రేలియా టీం ఒకవేళ బ్రిస్బేన్ వస్తే క్వారంటైన్ ఉండాల్సిందేనని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2021 5:44 pm
    Follow us on

    4th Test against Australia

    హోరాహోరాగా సాగుతున్న ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ఒక రాష్ట్రం వల్ల అంతా గందరగోళం నెలకొంటోంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదికగా ఈనెల 15 నుంచి నాలుగో టెస్ట్ జరుగనుంది. అయితే బ్రిస్బేన్ ఉన్న క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలో కరోనా కఠిన నిబంధనలు ఉన్నాయి. తాజాగా అక్కడ మూడు రోజుల పాటు లాక్ డౌన్ కూడా విధించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సిడ్నీ నుంచి భారత ఆటగాళ్లు, ఆస్ట్రేలియా టీం ఒకవేళ బ్రిస్బేన్ వస్తే క్వారంటైన్ ఉండాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే ఇప్పుడు భారత జట్టు ఆగ్రహానికి కారణమైంది.

    Also Read: స్మిత్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా.. ఇండియా నిలబడుతుందా?

    ఈ క్రమంలోనే తాజాగా బీసీసీఐ ఘాటుగా ఆస్ట్రేలియాకు లేఖ రాసింది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు క్వారంటైన్ లో ఉంటూ నానా ఇబ్బందులు పడ్డారని.. నాలుగో టెస్ట్ జరిగే బ్రిస్బేన్ లో కఠిన క్వారంటైన్ ఉండరని స్పష్టం చేసింది.

    దీంతో నాలుగో టెస్టు బ్రిస్బేన్ లో జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బ్రిస్బేన్ లో యూకే కొత్త కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసులు గుర్తించడంతో అక్కడ లాక్ డౌన్ విధించారు. దీంతో నాలుగో టెస్టు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.క్రికెట్ ఆస్ట్రేలియా సైతం దీనిపై కంగారుపడుతోంది.

    Also Read: ఆస్ట్రేలియాతో 3వ టెస్ట్.. భారత్ కొంపముంచిన పంత్

    ఇప్పటికే హోటల్ గదులకే పరిమితమై బ్రిస్బేన్ లో కఠిన కరోనా నిబంధనలతో ఆడలేమని భారత క్రికెట్ ఆటగాళ్లు స్పష్టం చేశారు. బ్రిస్బేన్ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్వారంటైన్ ఉండాల్సిందేనంటోంది. దీంతో ఈ టెస్టు జరగడం ప్రశ్నార్థకంగా మారింది.