https://oktelugu.com/

‘కేజీఎఫ్ 2’కి కూడా కాపీ బాధలు తప్పట్లేదు !

కేజీఎఫ్ 2 … ఒక కన్నడ సినిమా కోసం దేశం మొత్తం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడటం చరిత్రలో ఇదే మొదటిసారిగా పేర్కొనవచ్చు. ఈ మధ్య కాలంలో దక్షిణాది నుండి పాన్ ఇండియా మొత్తం విజయం సాధించిన సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా నిలిచింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో […]

Written By:
  • admin
  • , Updated On : January 8, 2021 / 12:43 PM IST
    Follow us on


    కేజీఎఫ్ 2 … ఒక కన్నడ సినిమా కోసం దేశం మొత్తం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడటం చరిత్రలో ఇదే మొదటిసారిగా పేర్కొనవచ్చు. ఈ మధ్య కాలంలో దక్షిణాది నుండి పాన్ ఇండియా మొత్తం విజయం సాధించిన సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా నిలిచింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ గా ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ ఉంటుందని ప్రకటించినప్పటి నుండి అందరిలోనూ ఈ సినిమా మీద ఆసక్తి నెలకొని ఉంది.

    Also Read: షూటింగే స్టార్ట్ కాలేదు, అప్పుడే క్లాసిక్ అంటున్నారు !

    ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్ 2’ నుంచి హీరో యష్ బర్త్ డే సందర్భంగా జనవరి 8 ఉదయం 10.18 గంటలకు టీజర్ ను విడుదల చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసి అభిమానుల్లో కుతూహలం పెంచారు. ఇక అందరూ టీజర్ కోసం ఎదురు చూస్తుంటే జనవరి 7న ఈ మూవీ టీజర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకి రావటం పెను సంచలనమైంది. దీంతో మేకర్స్ అనుకున్న అసలు తేదికి ముందుగానే జనవరి 7 రాత్రి 9.29 గంటలకు ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ టీజర్ ని అధికారకంగా విడుదల చేశారు. ఇదంతా సినిమా మీద హైప్ పెంచేసుకోవాటినికే అని సినీ వర్గాలలో చర్చ జరుగుతుంది.

    Also Read: త్వరలో ‘ఎన్టీఆర్’ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

    ఇక కేజీఎఫ్ 2 టీజర్ విషయానికి వస్తే తక్కువ సమయంలో 20 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడంతో పాటు రెండున్నర మిలియన్ ల లైక్స్ ను కూడా అతి తక్కువ సమయంలో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించినట్లుగా కనిపిస్తుంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో క్రూరంగా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ – రావు రమేష్ – ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రం కన్నడ తెలుగు తమిళ మలయాళం హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం వారు రిలీజ్ చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్