త్రివిక్రమ్ ‘మహాభారతం’… స్టార్ హీరోలే !

మహాభారతం యుగాలు, తరాలు మారుతున్న తనివీ తీరని ఇతిహాసం. ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసిన భారతం భారతమే. ఇప్పటి వరకు మన ఫిల్మ్ మేకర్స్ మహా భారతాన్ని ఎన్నో విధాలుగా తెరకెక్కించారు.. ఎన్ని సార్లు చూసినా.. ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే తాజాగా అత్యధిక భారీ బడ్జెట్‌‌‌తో రాజమౌళి కంటే ముందే మ‌హాభార‌తాన్ని పూర్తిగా సోష‌లైజ్ చేసి సినిమా తీసే ఆలోచ‌నలో త్రివిక్ర‌మ్ ఉన్నాడట. అంటే త్రివిక్రమ్ తీయబోయే మహాభారతంలో భారీ యుద్ధాలు, […]

Written By: admin, Updated On : January 8, 2021 12:55 pm
Follow us on


మహాభారతం యుగాలు, తరాలు మారుతున్న తనివీ తీరని ఇతిహాసం. ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసిన భారతం భారతమే. ఇప్పటి వరకు మన ఫిల్మ్ మేకర్స్ మహా భారతాన్ని ఎన్నో విధాలుగా తెరకెక్కించారు.. ఎన్ని సార్లు చూసినా.. ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే తాజాగా అత్యధిక భారీ బడ్జెట్‌‌‌తో రాజమౌళి కంటే ముందే మ‌హాభార‌తాన్ని పూర్తిగా సోష‌లైజ్ చేసి సినిమా తీసే ఆలోచ‌నలో త్రివిక్ర‌మ్ ఉన్నాడట. అంటే త్రివిక్రమ్ తీయబోయే మహాభారతంలో భారీ యుద్ధాలు, భారీ భారీ సెట్లు ఉండ‌వంతే. పాత్ర‌లు, వాటి సంఘర్షణలు మాత్రం క‌నిపిస్తాయి.

Also Read: ‘కేజీఎఫ్ 2’కి కూడా కాపీ బాధలు తప్పట్లేదు !

కాకపోతే మహాభారతం పూర్తిగా కాకుండా ప్ర‌ధాన ప‌ర్వాల్ని తీసుకుని దాన్ని పూర్తిగా సోష‌లైజ్ చేస్తారట. ఎలాగూ త్రివిక్రమ్ డైరెక్టర్ కాబట్టి.. ఈ సినిమాలో కూడా స్టార్ హీరోలే కనిపిస్తారు. ఏమైనా ఇతిహాసలను సినిమాలుగా తీయాలంటే.. ఇప్పుడు అందరూ త్రివిక్రమ్ చుట్టూనే తిరుగుతున్నారు. ఇప్పటికే నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి 1500 కోట్ల భారీ బడ్జెట్ తో “రామాయణం ” మూవీని ఇప్పటి కాలానికి అనుగుణంగా నిర్మించబోతున్నారు. కాగా ఈ చిత్రానికి కూడా మాటల మాంత్రికుడే స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడట . ఇప్పటికే దాదాపుగా డైలాగులుతో సహా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

Also Read: హాట్ సీన్స్ కి మరో హోమ్లీ ఆంటీ రెడీ !

కాగా ఈ చిత్రాన్ని అన్ని భాషలలోనూ ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఏది ఏమైనా మన మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ ను అద్భుతంగా రాసి అరవింద్ గారి చేతుల్లో పెట్టేసాడట. ఈ భారీ ఫ్రాంచైజ్ మొదటి భాగం 2022లో విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఈ మూవీ 3డి లో నిర్మించబడుతుంది. దంగల్ మూవీకి దర్శకత్వం వహించిన నితేష్ తివారీ, శ్రీదేవి నటించిన ‘మామ్’ కి దర్శకత్వం వహించిన రవి ఉద్యోవర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం చేస్తున్నారు. అలాగే భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ హిరణ్య కశ్యప సినిమాకు కూడా మాటలు అందిస్తున్నాడు త్రివిక్రమ్. మొత్తానికి త్రివిక్రమ్ పురాణాలను ఇతిహాసలను నేటి జనరేషన్ కి పరిచయం చేయబోతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్