ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ తరగతులు మళ్లీ వాయిదా..?

కరోనా వైరస్, లాక్ డౌన్ నిబంధనల వల్ల మార్చి నెల మూడో వారం పాఠశాలలు, జూనియర్ కాలేజీలు మూతబడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి సంవత్సరం జూన్ నెల తొలి, రెండవ వారాలలో తెరుచుకునే పాఠశాలలు, కాలేజీలు ఈ సంవత్సరం ఆలస్యంగా తెరుచుకున్నాయి. నవంబర్ నెల 2వ తేదీ నుంచి ఏపీలో 9, 10 తరగతులు, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు […]

Written By: Navya, Updated On : November 14, 2020 9:55 am
Follow us on

కరోనా వైరస్, లాక్ డౌన్ నిబంధనల వల్ల మార్చి నెల మూడో వారం పాఠశాలలు, జూనియర్ కాలేజీలు మూతబడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి సంవత్సరం జూన్ నెల తొలి, రెండవ వారాలలో తెరుచుకునే పాఠశాలలు, కాలేజీలు ఈ సంవత్సరం ఆలస్యంగా తెరుచుకున్నాయి. నవంబర్ నెల 2వ తేదీ నుంచి ఏపీలో 9, 10 తరగతులు, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి.

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కూడా పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా ఇంటర్ ఫస్టియర్ తరగతులు మళ్లీ వాయిదా పడ్డాయి. ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ క్లాసులను వాయిదా వేస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. జగన్ సర్కార్ కరోనా విజృంభణ నేపథ్యంలో ఒక్కో సెక్షన్ కు 40 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఈ నిబంధన వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయని భావించి ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. మరోవైపు ఆన్ లైన్ ప్రవేశాలు విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. వెబ్ సైట్ లో ప్రవేశాలకు ఆప్షన్లను ఎంపిక చేసుకునే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. దీంతో ఇంటర్ ఆన్ లైన్ ప్రవేశాల ప్రక్రియలో గందరగోళం నెలకొంది.

కొన్ని కాలేజీలు ఆన్ లైన్ లో ప్రవేశాల వల్ల నష్టపోతున్నామని.. గత విధానంలోనే అడ్మిషన్ల ప్రక్రియ జరుపుకునే విధంగా ఛాన్స్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు క్లాసులు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.