ఏపీ టీడీపీలో విషాదం
ఆంధ్రప్రదేశ్ లోని తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజుల కిందట ఆయనకు కరోనా సోకడంతో కోలుకున్నారు. అయితే మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పరిస్థితి విషమించి కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వైటీ రాజా మరణంతో ఆ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. కాగా 1999 నుంచి 2004 వరకు తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. […]
Written By:
, Updated On : November 15, 2020 / 09:31 AM IST

ఆంధ్రప్రదేశ్ లోని తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజుల కిందట ఆయనకు కరోనా సోకడంతో కోలుకున్నారు. అయితే మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పరిస్థితి విషమించి కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వైటీ రాజా మరణంతో ఆ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. కాగా 1999 నుంచి 2004 వరకు తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజా కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.