https://oktelugu.com/

2 షిఫ్టులు.. ఆగమాగం.. దర్శకులకు చుక్కలు చూపిస్తున్న పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాల కంటే రాజకీయాలపైనే మోజు ఎక్కువ. ఆయన సినిమాలను కేవలం ఆదాయం ఇచ్చే వనరుగానే చూస్తున్నారు. అందుకే ఆ సినిమాల్లో నటనపై, క్వాలిటీపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. రాజకీయాల కోసం పవన్ సినిమాలను ఆగమాగం జగన్నాథం అన్నట్టుగా పూర్తి చేస్తున్నాడని.. సీన్లు బాగా వచ్చినా రాకున్నా తానవంతుకు తాను నటించేసి వెళుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఒక రోజు కాల్షీట్ ను రెండు సినిమాలకు ఇచ్చి […]

Written By: , Updated On : March 3, 2021 / 10:23 AM IST
Follow us on

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాల కంటే రాజకీయాలపైనే మోజు ఎక్కువ. ఆయన సినిమాలను కేవలం ఆదాయం ఇచ్చే వనరుగానే చూస్తున్నారు. అందుకే ఆ సినిమాల్లో నటనపై, క్వాలిటీపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

రాజకీయాల కోసం పవన్ సినిమాలను ఆగమాగం జగన్నాథం అన్నట్టుగా పూర్తి చేస్తున్నాడని.. సీన్లు బాగా వచ్చినా రాకున్నా తానవంతుకు తాను నటించేసి వెళుతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఒక రోజు కాల్షీట్ ను రెండు సినిమాలకు ఇచ్చి సగం డే ఒక సినిమా పూర్తి చేసి.. ఇంకో సగం రెండో సినిమాకు కేటాయించి సాయంత్రం తర్వాత రాజకీయం చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

తాజాగా ఒకే సమయంలో పవన్ కళ్యాన్ రెండు సినిమాలకు కాల్షీట్లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. క్రిష్ సినిమా సెట్స్ పై ఉదయం 7 గంటలకు జాయిన్ అవుతున్న పవన్ దాన్ని 11 వరకు చేసి ప్యాకప్ చెప్పేస్తున్నాడట.. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి అయ్యప్పమ్ కోషియమ్ రిమేక్ లో జాయిన్ అవుతున్నాడట.. సాయంత్రం 5 గంటలకు ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సాయంత్రం జనసేన పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నాడట.. పార్టీ నేతలతో సమావేశాలు.. ప్రెస్ నోట్స్ పరిశీలన.. ఫోన్ సమావేశాలు నిర్వహిస్తున్నారట..

పవన్ ఆగమాగం వస్తూ పోతుండడంతో క్వాలిటీ సంకనాకి పోతోందని.. ఉదయం 7 గంటలకు షూటింగ్ కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుంచి క్రిష్ సినిమా యూనిట్ ఏర్పాట్లు చేస్తుండడం వారికి తలకు మించిన భారం అవుతోందని ఇండస్ట్రీ గుసగుసలు వినిపిస్తున్నాయి.