Mahesh-Rajamouli: మరి కొన్ని నెలల్లో రాజమౌళి-మహేష్ బాబు మూవీ పట్టాలు ఎక్కనుంది. స్క్రిప్ట్ ఫైనల్ దశకు చేరుకోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. కెరీర్లో మొదటిసారి మహేష్ బాబు-రాజమౌళి(Rajamouli) కలిసి పని చేస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లు అని సమాచారం. అసలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని భావిస్తున్నారట. రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించనున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి ఫేమ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించాలి అనుకుంటున్నారు.
అందుకే యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు. హాలీవుడ్ స్టార్స్ కి ఏ మాత్రం తగ్గని అందం, ఆహార్యం మహేష్ బాబు సొంతం. ఇండియానా జోన్స్ హాలీవుడ్ సక్సెస్ఫుల్ సిరీస్. ఆ తరహా లో మూవీ ఉంటుందని ఇప్పటికే చెప్పారు. ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా అట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు, కొన్నాళ్లుగా స్క్రిప్ట్ మీద కసరత్తు చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత కె ఎల్ నారాయణ.
రాజమౌళి చిత్రానికి మహేష్ బాబు రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించాల్సి ఉంది. ఈ క్రమంలో మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతనే చర్చ నడుస్తుంది. మహేష్ బాబు ప్రస్తుతం సినిమాకు రూ. 50 కోట్లు వరకు తీసుకుంటున్నారు. అయితే రాజమౌళి సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ దాదాపు రూ. 100 కోట్లు అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మూవీకి మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. దానికి బదులు లాభాల్లో వాటా అడుగుతున్నాడట.
గతంలో కూడా మహేష్ బాబు కొన్ని సినిమాలకు రెమ్యూనరేషన్ కాకుండా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ చిత్రానికి కూడా పర్సెంటేజ్ తీసుకోవాలి అనుకుంటున్నాడట. రాజమౌళి సినిమాలకు కర్త కర్మ క్రియ ఆయనే ఉంటారు. నిర్మాత కేవలం స్టాంప్ మాత్రమే నిర్మాణం నుండి బిజినెస్ వరకు ఆయనే చూసుకుంటారు. మహేష్ బాబుకి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేద్దాము అనుకుంటే… ఆయనేమో లాభాల్లో వాటా అడిగారట. దీంతో మహేష్ విషయంలో రాజమౌళి లెక్క తప్పిందనే వాదన మొదలైంది.
Web Title: Mahesh rajamouli movie latest updates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com