Smiley Emoji: సెల్ ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాతో ప్రపంచానికి కనెక్ట్ అయ్యారు. కాబట్టి ప్రతీ విషయంపై వారి స్పందనను ప్రపంచంతో పంచుకుంటున్నారు. ఒక విషయంపై మనసులో కలిగే భావాలను వ్యక్తం చేయాలంటే గతంలో ఇబ్బందిగా ఉండేది. పూర్తి స్థాయి వివరణగా రాయాల్సి ఉండేది. అయితే వీటిని సింప్లిఫై చేస్తూ ఏమోజీలు వచ్చాయి. ఇది వచ్చిన తర్వాత ఎంత పెద్ద విషయాన్ని అయినా చిన్న చిన్న బొమ్మల ద్వారా ఈజీగా చెప్పవచ్చు. మీ మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో దానికి తగ్గ బొమ్మను సెండ్ చేయడమే. ఆ తర్వాత అవతలి వ్యక్తి దానిలోని భావాన్ని బొమ్మ (ఏమోజీ) ద్వారా అర్థం చేసుకుంటాడు. ఈ మధ్య కొన్ని కొన్ని కంపెనీలు ఏమోజీలను వారికి అనుగుణంగా మార్చుకుంటున్నాయి. ఫేస్ లు, ఏఐతో క్రియేట్ చేయడం ఇలా చేస్తున్నారు. కానీ గతంలో ఏమోజీ కనిపెట్టిన వారి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. మనందరికి ‘స్మైలీ’ ఏమోజీ తెలుసుకదా.. అది ఎందుకు? ఎవరు? తయారు చేశారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పైగా దానికి చెల్లించింది తెలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. స్మైలీ ఏమోజీ తయారు చేసింది హార్వే రాస్ బాల్.
హార్వే రాస్ బాల్ 1963లో ఒక బీమా కంపెనీ తన ఉద్యోగుల్లో ధైర్యాన్ని పెంచేందుకు ఒక చిహ్నాన్ని రూపొందించాలని హైర్ చేసుకుంది. అతను పసుపు-నలుపు-నలుపుతో కూడిన నవ్వుతో విశాలమైన, చిరునవ్వుతో ఉన్న ఒక బొమ్మ గీసి ఇచ్చాడు. దీని కోసం అతను కేవలం 10 నిమిషాలు మాత్రమే వినియోగించాడు. ఇందుకు అతనికి 45 డాలర్లను కంపెనీ చెల్లించింది. అయితే అప్పటికి దానికి స్మైలీ పేరు పెట్టలేదు.
సదరు బీమా కంపెనీ గానీ, బాల్ గానీ దానికి ఎలాంటి పేరు పెట్టలేదు. అలాగే ట్రేడ్ మార్క్ కూడా చేయలేదు. ఆ బొమ్మ కేవలం కార్యాలయంలో అలంకారంగా మాత్రమే ఉంది. ఫ్రాంక్లిన్ లౌఫ్రానీ అనే ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఈ మార్క్‌కు ‘స్మైలీ’ అని పేరు పెట్టారు. లెవీస్, మార్స్ క్యాండీ వంటి కంపెనీలకు లైసెన్స్ ఇవ్వడం ద్వారా దాని చుట్టూ వ్యాపారం మొదలైంది.
లౌఫ్రానీ కుమారుడు ఒక వస్త్ర వ్యాపారం నిర్వహించే వాడు. ఇందులో జరా, ఫెండీ వంటి బ్రాండ్ దుస్తులు, ఇతర వస్తువులను అమ్మేవారు. దుస్తులు, బటన్స్, ఇతర పరికరాలపై ‘స్మైలీ’ని ముద్రించి అమ్మేవారు. దీంతో వారి వ్యాపారం పెరుగుతూ పోయింది. నేడు అది ఏమోజీగా మారింది.
స్మైలీ ఏమోజీ గురించి హార్వే రాస్ బాల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘నేను పసుపు కాగితంపై చిరునవ్వుతో ఒక వృత్తాన్ని డ్రా చేశాను. అది సూర్యరశ్మి, ప్రకాశవంతంగా ఉంది’ అని చెప్పారు. మొదట బీమా కంపెనీ ఉద్యోగుల కోసం ఇది ఉపయోగపడింది. ఆ తర్వాత దుస్తులపై, ఆ తర్వాత బట్టలపై, ఆ తర్వాత షూస్ ఇలా విస్తరించుకుంటూ వెళ్లింది. ఆనందాన్ని మనకు ఇచ్చిన హార్వే రాస్ బాల్ ఏప్రిల్ 12, 2001న మరణించి మనకు ‘ఆనందాన్నే’ మిగిల్చాడు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: He is the one who made the smiley emoji how much remuneration did he give
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com