Mufasa The Lion King : ఈమధ్య కాలం లో స్టార్ హీరోల అభిమానులు సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రభాస్ ఫ్యాన్స్ తో ఈ ట్రెండ్ మొదలైంది. ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ ని డైనోసర్ తో పోలుస్తూ చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ డైలాగ్ ని మీమ్స్ లోకి వాడేవారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్’ చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేసారు. అభిమానులు థియేటర్స్ వద్ద మరోసారి సందడి చేసాడు. ఒక ప్రభాస్ అభిమాని చాలా తెలివిగా ఒక డైనోసార్ బొమ్మని కొనుగోలు చేసి, సలార్ ప్రదర్శిస్తున్న థియేటర్ ప్రొజెక్టర్ కి ఆ డైనోసార్ బొమ్మని అడ్డు పెడుతాడు. అలా అతను పెట్టగానే డైనోసార్ బొమ్మ పెద్ద ఆకారం లో స్క్రీన్ పై పడుతుంది. అప్పట్లో ఈ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమాని చూపించిన క్రియేటివిటీ కి ప్రశంసలు అందాయి.
అదే విధంగా నేడు మహేష్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకి వేసి చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నేడు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన ‘ముఫాసా : ది లయన్ కింగ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. మహేష్ త్వరలో రాజమౌళి తో సినిమా చేయబోతున్నాడు. మరో మూడేళ్ళ పాటు వెండితెర మీద కనిపించడు. కనీసం ఈ వాయిస్ ఓవర్ అందించిన సినిమాకి అయినా ఘనంగా సంబరాలు చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో స్పెషల్ షోస్ వేసి మహేష్ సినిమా విడుదలైతే ఎంతటి హంగామా చేస్తారో, ఆ రేంజ్ హంగామా చేసారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి.
అయితే ఒక మహేష్ అభిమాని బెజవాడ లోని ఒక థియేటర్ వద్ద ‘ముఫాసా ‘ మూవీ పోస్టర్స్ లో ఉన్నటువంటి సింహం పిల్ల కి చాలా దగ్గర పోలిక ఉన్న పిల్లి ని తీసుకొచ్చారు. ఈ పిల్లి ని చూస్తే ఎవరైనా సింహం పిల్ల అని అనుకోవాల్సిందే. అంతటి దగ్గర పోలిక ఉన్న పిల్లిని తీసుకొచ్చారు. దీనిని చూసి అక్కడికి వచ్చిన ఆడియన్స్ ఇది నిజమైన సింహం పిల్ల ఏమో అనుకోని భయపడ్డారు. ఆ తర్వాత అది పిల్లి అని తెలుసుకొని నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. మహేష్ బాబు ఫ్యాన్స్ క్రియేటివిటీ కి నెటిజెన్స్ పగలబడి నవ్వుకున్నారు. ఈమధ్య కాలం లో స్టార్ హీరోలు మాత్రమే కాదు, ఆ స్టార్ హీరోల అభిమానులు ట్రెండ్ ని సృష్టిస్తారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ‘ముఫాసా’ చిత్రానికి మహేష్ బాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన స్పెషల్ షోస్ కి బంపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Cinema pichollayandhu Vijayawada cinema pichollu veraya… ❤️#Mufasa @urstrulyMahesh pic.twitter.com/sopPpJialS
— ᴇᴅᴜᴘᴜɢᴏᴛᴛᴜ ʏᴇᴅʜᴀᴠᴀ (@mohith000000) December 20, 2024