Digestion Time of Foods:మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలి. కానీ చాలామంది రుచిని కోరుతూ ప్రాసెస్ ఫుడ్ ను ఇష్టపడుతూ ఉంటారు. ఇందులోనూ మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని రకాల పదార్థాల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమే. కానీ అవి ఎలాంటి దయచేసి క్రియలో ఉంటాయో తెలుసుకోవడం అవసరం. ఒక పదార్థం తీసుకున్న తర్వాత అది ఎంతసేపట్లో జీర్ణం అవుతుందో తెలుసుకుంటే దానిని సమయాన్ని బట్టి తీసుకోవచ్చు. ఉదాహరణకు ఉదయమే మాంసాహారం తీసుకోవడం వల్ల రోజంతా ఇబ్బందులకు గురై అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏ ఏ ఆహారం ఎంతసేపట్లో జీర్ణం అవుతుందో తెలుసుకుంటే దానిని బట్టి క్రమ పద్ధతిన ఆహారం తీసుకోవచ్చు. మరి వాటి గురించి తెలుసుకుందామా..
Also Read: మీరు జీవితంలో ఎదగాలంటే ఈ ఒక్కటి పక్కకు పెట్టండి..
కొన్ని రకాల పదార్థాలు తీసుకోవడం వల్ల వెంటనే డైజేషన్ అనిపించి తక్షణ శక్తి వస్తుంది. మరికొన్నింటి వాటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో అవి జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది. అయితే ఇలాంటి వాటిని ఎక్కువగా శక్తిని ఖర్చు చేసే సమయంలో తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. అలాకాకుండా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకొని ఏ పని చేయకుండా ఉండడం వల్ల తొందరగా జీర్ణం కాకుండా ఇబ్బంది పెడతాయి. కేవలం మాంసాహారం పదార్థాలు మాత్రమే కాకుండా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా జీర్ణం కావడానికి సమయం తీసుకుంటాయి.
మాంసాహారం లో భాగంగా చికెన్ తీసుకున్న తర్వాత పూర్తిగా జీర్ణం కావడానికి 2 గంటల సమయం పడుతుంది. అందువల్ల ఇలాంటి ఆహారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం మంచిది. ఇదే సమయంలో కోడిగుడ్డు తిన్న తర్వాత పూర్తిగా జీర్ణం కావడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. వెజిటేబుల్ కూరగాయల విషయానికి వస్తే క్యారెట్ అరగడానికి 50 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఆలుగడ్డ తిన్న తర్వాత పూర్తి జీర్ణం కావడానికి గంట సమయం తీసుకుంటుంది.
Also Read: మీరు జీవితంలో ఎదగాలంటే ఈ ఒక్కటి పక్కకు పెట్టండి..
కొన్ని రకాల పనులు కూడా జీర్ణం కావడానికి తేడా ఉంటాయి. వీటిలో ప్రధానంగా యాపిల్ తిన్న తర్వాత జీర్ణం కావడానికి 60 నిమిషాల సమయం పడుతుంది. అలాగే డ్రైఫ్రూట్స్ లోని కాజు తిన్న తర్వాత పూర్తిగా జీర్ణం కావడానికి 6 గంటల సమయం తీసుకుంటుంది. బాదంను నేరుగా తింటే ఇది పూర్తిగా జీర్ణం కావడానికి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలు వాతావరణం సక్రమంగా ఉన్నప్పుడు తీసుకోవడం ద్వారా చాలా ఆలస్యంగా జీర్ణం అయినా శరీరానికి శక్తిని ఇస్తాయి. కానీ వేసవికాలంలో ఇలాంటి వాటికంటే తొందరగా జీర్ణమయ్యే పదార్థాలను తీసుకోవాలి. అలాంటి వాటిలో నీరు.. ఇది జీర్ణం కావడానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. వాటర్ మిలన్ జీర్ణం కావడానికి 20 నిమిషాలు పడుతుంది.
ఇలా కొన్ని ఆహార పదార్థాలు అవి జీర్ణం కావడానికి తీసుకునే సమయాన్నిబట్టి.. మనం కూడా వాటిని ఎప్పుడు తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.