Relationship: ప్రస్తుత జనరేషన్‌లో జంటలు అసలు సమయమే గడపడం లేదు. రోజంతా ఆఫీస్ వర్క్, ఆ తర్వాత కొంత సమయం మొబైల్ వాడి నిద్రపోతున్నారు. ఎంత బిజీగా ఉన్న కూడా భాగస్వామికి కొంత సమయం ఇవ్వకపోతే ఆ బంధం మధ్య అన్యోన్యత అసలు పెరగదు. బంధంతో ఉండే ఇద్దరు సంతోషంగా ఉండాలంటే రోజులో కొంత సమయం భాగస్వామితో గడపాలి. పోని రాత్రి సమయాల్లో అయిన భాగస్వామికి సమయం ఇస్తారా? అంటే అది కూడా ఉండదు. డబ్బు సంపాదిస్తున్నాం, భాగస్వామికి కావాల్సిన వస్తువులు ఇస్తున్నామని అనుకుంటారు. కానీ భాగస్వామికి కావాల్సిన టైం మాత్రం ఇవ్వరు. ఈ రోజుల్లో భాగస్వాములు కొందరు నైట్ షిఫ్ట్‌లు చేస్తున్నారు. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం ఇంకా దూరమే అవుతుంది. కానీ దగ్గర మాత్రం కావడం లేదు. ముఖ్యంగా అసలు భాగస్వామితో కలిసి నిద్రపోరు. వేర్వేరు షిఫ్ట్‌లలో పని చేయడం, మొబైల్‌తో బిజీగా ఉండటం వల్ల చాలా మంది కలిసి ఉండరు. దీనివల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగకుండా తగ్గుతుందని రిలేషన్‌షిప్ నిపుణులు అంటున్నారు.
భాగస్వాములు ఎవరికి నచ్చినట్లు వారి పని చేసుకుని దూరంగా ఉండకుండా దగ్గరగా ఉండాలి. భాగస్వామి పక్కన ఉంటే మొబైల్ చూడటం ఆపేయాలి. వీలు కుదరకపోయిన కూడా టైమ్ సెట్ చేసుకుని మరి భాగస్వామితో సమయం గడపాలి. కొందరు భాగస్వామికి దూరంగా నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య దూరంగా పెరగుతుంది. ఇలా దూరం పెరగకుండా దగ్గర కావాలంటే భాగస్వామితో కలిసి నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం, ప్రేమ కూడా పెరుగుతాయి. దీంతో కొంతవరకు గొడవలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోవడం వల్ల అసలు భాగస్వామితో బయటకు వెళ్లరు. దీనివల్ల ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే తమ పార్ట్‌నర్‌తో సమయం గడపాలని ప్రతీ పార్ట్‌నర్ కూడా కోరుకుంటారు. కనీసం అప్పుడప్పుడైనా బయటకు తీసుకెళ్లకుండా, తనతో సమయం గడపకుండా ఉంటే మనస్పర్థలు వస్తాయి.
కొందరు ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయి.. భాగస్వామితో కలిసి తినరు, నిద్రపోరు. నాకు పని ఉంది.. నువ్వు పడుకో అని అంటారు. ఇలా చేయకుండా తొందరగా వర్క్ చేసి భాగస్వామితో కొంత సమయం మాట్లాడుకుంటూ కలిసి నిద్రపోండి. దీనివల్ల భాగస్వామి మనస్సులో విషయాలను మీకు చెప్పగలరు. ఎవరికి చెప్పుకోలేని బాధ ఉన్న కూడా షేర్ చేసుకోగలరు. ఇలా కలిసి అన్యోన్యంగా ఉండటం వల్ల ఇద్దరి మధ్య ఏ చిన్న గొడవలు వచ్చిన కూడా వెంటనే పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటే దగ్గరగా ఉండటం వల్ల ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ గుణం ఉంటుంది. దీంతో గొడవలు రావు.. ఒకవేళ వచ్చిన కూడా వెంటనే పరిష్కారం అవుతాయి. కాబట్టి వీలైనంత వరకు రోజూ భాగస్వామితో కలిసి నిద్రపోవడానికి ప్రయత్నించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు రిలేషన్ నిపుణుల సలహాలు తీసుకోగలరు.