Life Style: మాటను జాగ్రత్తగా వాడాలి.. లేదంటే ఎన్ని అనర్థాలో తెలుసా?

అహంతో కూడుకున్న వారు తమని తాము గొప్ప చేసుకోవడం కోసం ఇతరులను కించపరిచి మాట్లాడడం, ఇతరులు తక్కువ అన్నట్టుగా మాట్లాడటం చేస్తుంటారు. అయితే బాణాలకంటే కూడా ఎక్కువ బాధించేవి వాక్ బాణాలే అని గుర్తుపెట్టుకోవాలి.

Written By: Swathi, Updated On : April 8, 2024 2:44 pm

Life Style

Follow us on

Life Style: ఒక ప్రాంతాన్ని, ఒక జాతిని, ఒక కులాన్ని, ఒక మతాన్ని కలిపి తిడుతుంటారు కొందరు. పలానా రాష్ట్రం, ఫలానా ఊరు, ఫలానా ప్రాంతం అంటూ అందరిని కలిపి తిడుతుంటారు జ్ఞానం లేనివారు. కానీ ఒకరు చేసిన తప్పుకు అందరిని నిందించడం ఎంత వరకు కరెక్ట్. ఎదుటివారిని దూషిస్తున్నామంటే మనం గొప్ప అని ఫీల్ అవుతుంటారు కూడా. కానీ ఇలాంటి విషయాల వల్ల ఎదుటివారు ఎంత బాధ పడుతారు అనే విషయాన్ని మర్చిపోతారు. మరి మీరు కూడా ఇలాంటి వారిని చూశారా?

అహంతో కూడుకున్న వారు తమని తాము గొప్ప చేసుకోవడం కోసం ఇతరులను కించపరిచి మాట్లాడడం, ఇతరులు తక్కువ అన్నట్టుగా మాట్లాడటం చేస్తుంటారు. అయితే బాణాలకంటే కూడా ఎక్కువ బాధించేవి వాక్ బాణాలే అని గుర్తుపెట్టుకోవాలి. ఒకరు తప్పు చేస్తే వారిని మాత్రమే నిందించాలి. కానీ అందరిని కలిపి నిందించడం వల్ల ఇతరుల మనసు నొచ్చుకుంటుంది. ఏం చేయకుండా తిట్టడం వల్ల బాధ భరించేకపోతారు కొందరు. ఎవరిని అయినా నిందిస్తే వారి తప్పును నిర్ధారణ చేసుకున్న తర్వాతనే అనాలి.

కొన్ని సార్లు మీరు చేసే చిన్న తప్పు వల్ల కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతినవచ్చు. చిన్నవిషయం తెలియగానే అందరినీ తిడుతుంటారు. లేదంటే అందరినీ దూషిస్తుంటారు. అందులో నిజం ఎంత ఉంది అని తెలుసుకోకుండానే నిందించడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. అందుకే ఇలాంటి తప్పులు చేయకూడదు అంటారు పెద్దలు. ఎంతో సెన్సిటివ్ విషయాల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఇలాంటి వాటిని ఆత్మాభిమానం దెబ్బ తినింది అంటూ బాధ పడతారు.

కొందరు అయితే నలుగురిలో పరువు పోయింది అని ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటారు. అందుకే కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ మాట జారితే వెనక్కి తీసుకెలేం అంటారు పెద్దలు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అనే సామెత కాస్త తగ్గితే బాగుండు. సున్నితమైన మనస్తత్వం గల ప్రజలు కాస్త మనశ్శాంతిగా నిద్రపోతుంటారు.