Credit Cards: ఈ క్రెడిట్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్..

యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డు వాడిన సమయంలో గడువులోగా బిల్లు చెల్లించడానికి డబ్బు లేకపోతే ఆ మొత్తాన్ని ఈఎంఐ గా మార్చుకోవచ్చు. ఇలా ఈఎంఐ మార్చుకోడానికి అక్కడే అప్షన్లను ఇచ్చినట్లు తెలిపారు.

Written By: Chai Muchhata, Updated On : April 8, 2024 2:32 pm

Credit Card Users

Follow us on

Credit Cards: అత్యవసర సమయంలో డబ్బు అవసరం ఉన్నవారికి క్రెడిట్ కార్డులు మంచి నేస్తాలుగా మారాయి. కొన్ని అవసరాలకు క్రెడిట్ కార్డును వడ్డీ లేకుండా 45 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. దీంతో అత్యవసం వస్తువులు కావాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతోంది.క్రెడిట్ కార్డుల ద్వారా సరుకులు కొనుగోలు చేయాలనుకుంటే విక్రయషాపుల్లో స్వైప్ మిషన్ ఉండాలి. కానీ ఇప్పుడు కొత్తగా యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డును వాడుకునే సదుపాయం వచ్చింది. ఇది రూపే కార్డుతోనే సాధ్యమవుతోంది. తాజాగా రూపే కార్డును ఎక్కువగా వినియోగించడానికి మరిన్ని సౌకర్యాలు కల్పించినట్లు నేషనల్ పేమేంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ సీపీ ఐ) తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే..

కిరాణం షాపు నుంచి షాపింగ్ మాల్ వరకు క్రెడిట్ కార్డు వాడకం ఎక్కువైంది. లేటేస్టుగా రూపే క్రెడిట్ కార్డును ఫోన్ పే, గూగుల్ పే యాప్ లకు లింక్ చేసుకొని స్వైపింగ్ మిషన్ అవసరం లేకుండా వాడుకోవచ్చు. గడువులోగా బిల్లు చెల్లిస్తే ఈ మొత్తానికి ఎటువంటి అదనపు ఛార్జీలు పడవు. పైగా 45 రోజుల గడువు ఉంటుంది. దీంతో చాలా మంది వీటికి ఆకర్షితులవుతున్నారు. వీరిని మరింతగా ప్రోత్సహించడానికి ఎన్ సీపీఐ కొత్తగా ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డు వాడిన సమయంలో గడువులోగా బిల్లు చెల్లించడానికి డబ్బు లేకపోతే ఆ మొత్తాన్ని ఈఎంఐ గా మార్చుకోవచ్చు. ఇలా ఈఎంఐ మార్చుకోడానికి అక్కడే అప్షన్లను ఇచ్చినట్లు తెలిపారు. వీటితో పాటు క్రెడిట్ అకౌంట్ బిల్ పేమేంట్, ఇన్ స్టాల్ మెంట్ పేమేంట్ ఆప్షన్, లిమిట్ మేనేజ్ మెంట్ వంటీ ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. రూపే కార్డులు అందించిన బ్యాంకులు మే 31 లోగా ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్ సీపీఐ తెలిపింది.

ఇప్పటి వకు క్రెడిట్ కార్డు బిల్ పేమేంట్ వంటివి సంబంధిత బ్యాంక్ యాప్ లేదా ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్లు ఉండేవి. కానీ ఇప్పుడు బిల్ పేమేంట్ చేయడానికి సులభతరం చేసినట్లు ఎన్ సీపీఐ తెలిపింది.అంతేకాకుండా రూపే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచమని బ్యాంకుకు నేరుగా వెళ్లకుండా ఇక్కడి నుంచే బ్యాంకును కోరే అవకాశం కూడా కల్పించనున్నారు. ఇక క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ బిల్, మినమమ్ బిల్, టోటల్ అమౌంట్ వంటివి కూడా ఇప్పటి నుంచి తెలుసుకోవచ్చు.