https://oktelugu.com/

Credit Card: క్రెడిట్ కార్డుతో కూడా బిజినెస్ చేయవచ్చు.. అదెలాగో తెలుసుకోవాలని ఉందా..?

క్రెడిట్ కార్డ్ ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చు.. లేదా ఇతర ఆర్థిక సదుపాయాలను సమకూర్చుకోవచ్చు. ఈ 45 రోజులపాటు క్రెడిట్ కార్డ్ అందించిన బ్యాంకులు వినియోగదారుల నుంచి ఎలాంటి చార్జీలు అందించవు. అయితే వీరు ఇలా ఎందుకు ఉచితంగా ఇస్తారు? అనే సందేహం చాలా మందికి రావచ్చు. క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేసే వ్యాపారుల నుంచి కంపెనీలు కొంత ఛార్జ్ వసూలు చేస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 23, 2024 / 11:21 AM IST

    Credit-Card

    Follow us on

    Credit Card:  గురించి నేటి కాలంలో తెలియని వారు ఉండరు. ఈ కార్డు వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని కొందరు.. లేదా ఈ కార్డుతో అప్పుల భారం పెరుగుతుందని మరికొందరు.. అనుకుంటారు. అయితే ఏదైనా వాడకాన్ని బట్టే లాభం, నష్టం ఉంటుంది. అత్యవసర సమయంలో ఇతరులను డబ్బు అడిగే బదులు క్రెడిట్ కార్డు ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. కనీసం 45 రోజులపాటు ఉచితంగా డబ్బు ఇచ్చే మార్గం క్రెడిట్ కార్డ్ ద్వారానే ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్ వాడిన తర్వాత దీని బిల్లును సమయానికి చెల్లించకపోతే మాత్రం వడ్డీ భారం భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అవగాహనతో క్రెడిట్ కార్డును వాడుకోవాల్సి ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు వల్ల ఇప్పటివరకు రివార్డ్స్, ఆఫర్లు మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డు తో బిజినెస్ కూడా చేయొచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.

    దాదాపు 45 రోజులపాటు క్రెడిట్ కార్డ్ ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చు.. లేదా ఇతర ఆర్థిక సదుపాయాలను సమకూర్చుకోవచ్చు. ఈ 45 రోజులపాటు క్రెడిట్ కార్డ్ అందించిన బ్యాంకులు వినియోగదారుల నుంచి ఎలాంటి చార్జీలు అందించవు. అయితే వీరు ఇలా ఎందుకు ఉచితంగా ఇస్తారు? అనే సందేహం చాలా మందికి రావచ్చు. క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేసే వ్యాపారుల నుంచి కంపెనీలు కొంత ఛార్జ్ వసూలు చేస్తాయి. దీంతో బ్యాంకులు వినియోగదారులకు ఉచితంగా అందిస్తారు. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా జనరేట్ అయిన బిల్లును గడువులోగా చెల్లించకపోతే మాత్రం భారీగా వడ్డీ ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. అందువల్ల క్రెడిట్ కార్డును వాడుతూ సమయానికి బిల్లు చెల్లించాలి .
    క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం వల్ల కొన్ని బ్యాంకులు రివార్డులు అందిస్తాయి. మరికొన్ని బ్యాంకులు ఆఫర్లు ప్రకటిస్తాయి. దీంతో వినియోగదారులకు క్రెడిట్ కార్డు ద్వారా ఉచితంగా సమయానికి డబ్బు అందరమే కాకుండా రివార్డు పాయింట్స్ తో కూడా వస్తువులు కొనుగోలు చేయవచ్చు. లేదా కొన్ని బ్యాంకులు రివార్డ్ పాయింట్స్ అన్ని కలిపి ఆదాయాన్ని అందిస్తాయి. ఇలా క్రెడిట్ కార్డు వల్ల వినియోగదారులకు అదనంగా ప్రయోజనమే ఉంటుంది. కానీ గడువు తేదీలోగా బిల్లు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గి రివాంట్ పాయింట్స్ తగ్గుతాయి. అలాగే ఆఫర్స్ కూడా రాకుండా పోతాయి.

    అయితే క్రెడిట్ కార్డు ద్వారా కూడా వ్యాపారాన్ని చేయొచ్చు అనే విషయం అందరిని ఆశ్చర్యపరచవచ్చు. కానీ దీనితో అదనంగా ఆదాయాన్ని చేకూర్చుకోవచ్చు. అది ఎలాగంటే? ఉదాహరణకు ఒక వ్యక్తికి నెల నెల ఒకటో తారీకు జీతం వస్తుంది అనుకుందాం. అయితే ఈ జీవతం డబ్బులను ఆ వ్యక్తి పక్కన పెట్టుకోవాలి. ఈ క్రెడిట్ కార్డు తో నెలరోజులపాటు వస్తువులతో పాటు వివిధ అవసరాలను తీర్చుకోవాలి. దీనికి సంబంధించిన బిల్లు వచ్చేనెల 15 లేదా నిర్ణయించుకున్న తేదీల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయంలో జీతం డబ్బులను 30 నుంచి 45 రోజులపాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తరువాత బిల్లు చెల్లించే సమయానికి రిలీజ్ చే సుకోవాలి. ఇలా 45 రోజులపాటు అదనంగా ఆదాయం వస్తుంది. అయితే క్రెడిట్ కార్డు వాడే బిల్లు చెల్లించే మొత్తం జీతం ఉంటేనే ఇలాంటి ఆదాయాన్ని పొందవచ్చు. లేకుంటే మరో అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతినెల కొంతవరకు క్రెడిట్ కార్డు ద్వారా ప్రధానంగా ఆదాయాన్ని పొందవచ్చు.