Kashi Yatra : భూమిపై పురాతన నగరాల్లో ఒకటిగా వారణాసికి పేరుంది. హిందూమతం ఆధ్యాత్మిక రాజధానిగా వారణాసిని పిలుస్తారు. మనోహరమైన నగరం కూడా ఇది. పర్యాటకులకు, యాత్రికులకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది ఈ పట్టణం. అందమైన ఘాట్‌లు, దివ్యమైన ఆలయాలు, రుచికరమైన ఆహారానికి ప్రసిద్ధి చెందిన వారణాసికి వెళ్లాలంటే కచ్చితంగా అదృష్టం ఉండాలి మాస్టర్. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత చాలా మందికి ఓ క్లారిటీ ఉండదు. ముందుగా ఏ ప్రాంతాన్ని సందర్శించుకోవాలి. ఎక్కడికి వెళ్లాలి. ఎలా వెళ్లాలి. ఎన్ని చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయో తెలియదు. సో మీరు కాశీకి వెళ్లాలి అనుకుంటే మాత్రం ఈ ఆర్టికల్ చదివి వెళ్లండి. కాశీకి వెళ్లిన తర్వాత తప్పక సందర్శించాల్సిన 7 ఉత్తమ ప్రదేశాలు గురించి తెలుసుకుంటే కచ్చితంగా అక్కడికి వెళ్లే వస్తారు. మరి అవేంటంటే?
కాశీ విశ్వనాథ దేవాలయాన్ని మిస్ చేసి మాత్రం రావద్దు. కొత్తగా పునరుద్ధరించబడిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ స్థలంలోని ప్రశాంతత మీకు మరో ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతిని అందిస్తుంది. ఇక కాశీలో చాలా ఘాట్ లు ఉంటాయి. అందులో దశాశ్వమేధ ఘాట్ కచ్చితంగా వెళ్లండి. ఈ దశాశ్వమేధ ఘాట్ వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ ఘాట్‌లలో ఒకటి. ఈ ఘాట్ వద్ద ఉదయం చాలా అందంగా ఉంటుంది. ఇక సాయంత్రం హారతులు చూడటానికి రెండు కళ్లు సరిపోవు.
సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ ను తప్పక సందర్శించండి. హిందువుల కోసం కట్టిన ఓ పవిత్రమైన ఆలయం ఇది. ఆధ్యాత్మికత, ఆనందం, సంతోషాలను అందిస్తుందా ఈ టెంపుల్ అనిపిస్తుంది. సారనాథ్ టెంపుల్ గురించి విన్నారా?
వారణాసి నుంచి 30 నిమిషాల ప్రయాణం తర్వాత మీరు సారనాథ్‌కు వెళ్తారు. ఇక్కడ మీరు బౌద్ధ ఆరామాలు, స్థూపాలతో నిండిన ప్రదేశాన్ని చూడవచ్చు. అంతేకాదు ప్రశాంతతలో మునిగిపోతారు కూడా.
అస్సీ ఘాట్ వారణాసిలో ఉన్న ఘాట్‌లలో ఒకటైన ఈ ఘాట్‌ను చూడండి. దీనికి సమీపంలో ఉన్న అందమైన కేఫ్‌లు మిమ్మల్ని ఆనందభరితులను చేస్తాయి. బనారస్ హిందూ యూనివర్సిటీని కూడా కాశీకి వెళ్లి చూడవచ్చు. పచ్చని ప్రదేశాలు, నిర్మాణ శైలి, మందిరాలను చూసేందుకు ఇక్కడికి వెళ్లండి. కాశీ చాట్ భండార్ కూడా మిమ్మల్ని ఆనందించేలా చేస్తుంది. వారణాసి సందడి మధ్య ఆహార ప్రియుల స్వర్గంగా ఈ ప్రాంతం ఉంటుంది. ప్రసిద్ధ ‘తమతార్ చాట్’ కోసం ఈ స్థలానికి వెళ్లండి.
వారణాసీలో చాలా ఘాట్ లు ఉన్నాయి. అందులో మీకు వీలుంటే మరెన్నో ఘాట్ లను కూడా చూడవచ్చు. ఇక ఇక్కడ తులసి మానస్ ఆలయం, దుర్గ గుడి, భారత్ మాతా మందిర్, చునార్ కోట, రాంనగర్ ఫోర్ట్ & మ్యూజియం, వారణాసి ఫన్ సిటీ, భారత్ కళా భవన్ మ్యూజియం, టిబెటన్ ఆలయాలను మిస్ చేయవద్దు.