Loan On PAN Card: ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్ లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా కొందరు అక్రమార్కులు ఇతరుల వివరాల ఆధారంగా డబ్బులు దోచుకుంటున్నారు. గతంలో బ్యాంక్ అకౌంట్ ప్లాట్ చేసి ఆందోళన నుంచి స్కాన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇతరుల క్రెడిట్ కార్డులు.. పాన్ కార్డులు.. ఆధార్ కార్డుల ఆధారంగా లోన్లు తీసుకుంటున్నారు. అయితే కొన్ని రోజుల వరకు వినియోగదారులకు తెలియకుండా ఈఎంఐ పే చేసి.. ఆ తర్వాత ఈఎంఐ పే చేయడం లేదు. దీంతో రికవరీ ఏజెంట్ సంబంధిత వినియోగదారునిని నిలదీస్తున్నారు. దీంతో అసలు విషయం బయటపడిన తర్వాత వినియోగదారుడు లబోది ఇవ్వమంటున్నాడు. మరి తమకు తెలియకుండా లోన్ ఎవరు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు అని చెక్ చేసుకోవడం ఎలా?
క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది బ్యాంకు లోన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే బ్యాంక్ అకౌంట్ నిర్వహించడానికి పాన్ కార్డ్ నేడు తప్పనిసరిగా మారింది. పాన్ కార్డు ఉంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా.. ఎలాంటి ఆర్థిక వ్యవహారమైన జరిపించే అవకాశం ఉంటుంది. అందువల్ల కొందరు సైబర్ నేరగాళ్లు కేవలం పాన్ కార్డును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పాన్ కార్డు ఉంటే దాని ద్వారా లోన్ తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అయితే చాలామంది వినియోగదారులు తమ పాన్ కార్డును ఇష్టం వచ్చినట్లు ఇతరులకు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా తమ పాన్ కార్డు వివరాలను చెప్పిన తర్వాత.. అది ఎందుకు చెబుతున్నాము? అనేది తెలుసుకోవాలి. లేదా ఎక్కడెక్కడ వివరాలు ఇచ్చామో? కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా పాన్ కార్డును ఎప్పుడు ఇతరులకు ఇవ్వకూడదు. ఇలా ఇచ్చి ఆ తర్వాత తమకు తెలియకుండా లోన్లు తీసుకున్నట్లు గుర్తిస్తే ఆ తర్వాత ఇలా చేయాలి.
Also Read: అంతర్జాతీయ యాత్రకు వెళ్తే మీ వద్ద ఈ 5 పత్రాలు మస్ట్ గా ఉండాలి..
ఆన్లైన్లో సిబిల్ స్కోర్ చూపించే కొన్ని యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో వివరాలు అందించాలి. దీంతో అందులో సిబిల్ స్కోర్ తగ్గినట్లు కనిపిస్తే.. పాన్ కార్డు ద్వారా ఇతరులు తెలియకుండానే లోన్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉదాహరణకు ఎస్బిఐ బ్యాంకు ద్వారా ఎవరైనా లోన్ తీసుకున్నట్లు గుర్తిస్తే.. ఈ బ్యాంకుకు సంబంధించిన కార్డు అనే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో లోన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ లోకి వెళితే.. లోన్ కు సంబంధించిన వివరాలు తెలిసిపోతాయి.
ఇలా లోన్ పై ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. లేకుంటే కొన్ని రోజుల తర్వాత తెలియకుండానే కొందరు భారీ మొత్తంగా లోన్ తీసుకొని ఫ్రాడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే తమకు తెలియకుండా లోన్ తీసుకున్నారని గుర్తిస్తే పోలీసులకు లేదా బ్యాంకు వారికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఆధార్, పాన్ కార్డు వివరాలను ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.
View this post on Instagram