https://oktelugu.com/

Divorce: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీరు కూడా విడాకులు తీసుకుంటారు?

చిన్న పరిష్కారాన్ని చేయని కొందరు దంపతులు విడాకులు అనే పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఈ విడాకుల వరకు ఆలోచించడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి అవేంటో ఓ సారి చూసేయండి.

Written By: , Updated On : April 15, 2024 / 10:51 AM IST
Would you get divorced if you had these symptoms

Would you get divorced if you had these symptoms

Follow us on

Divorce: ఈ మధ్య చాలా మంది విడాకుల బాట పడుతున్నారు. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలను భూతద్దంలో పెట్టి చూస్తూ మరీ విడాకులు తీసుకుంటున్నారు. కూర్చుని మాట్లాడుకుంటే సర్దుకొని పోయే గొడవల గురించి కూడా పెద్దగా ఆలోచిస్తున్నారు. చిన్న పరిష్కారాన్ని చేయని కొందరు దంపతులు విడాకులు అనే పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఈ విడాకుల వరకు ఆలోచించడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి అవేంటో ఓ సారి చూసేయండి.

సెక్సువల్ రిలేషన్.. భార్యాభర్తల మధ్య విడాకులకు కారణమయ్యేది ప్రధానంగా లైంగిక జీవితమే. భాగస్వామితో సెక్సువల్ లైఫ్ సుఖంగా లేకపోతే ఇతరులను కోరుకోవడం, లేదా వీరితో కలిసి ఉండటం ఇష్టం లేకపోవడం వంటివి జరుగుతాయి. తద్వారా విడాకుల వరకు ఆలోచిస్తారు.

గొడవలు.. చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడితే కూడా విడాకులు తీసుకోవాలి అనిపిస్తుందట. చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోవడం లేదంటే ఎక్కడ లోపం ఉందో ఆలోచించాలి. పెద్దలు కుదిర్చిన పెళ్లి లో అర్థం చేసుకోవడం పెద్ద సమస్య. ఒకరంటే ఒకరికి తెలియకపోవడంతో పెళ్లి తర్వాత వారిని అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇలాంటి విషయాలకు కూడా విడాకులు తీసుకుంటున్నారు కొందరు.

పని ఒత్తిడి.. భార్యాభర్తలు ఇద్దరు పనులు చేస్తుంటారు. ఉద్యోగంలో లేదా ఇతర పనిలో ఉండే ఒత్తిడిని భాగస్వామి మీద చూపించడం, చిరాకు, కోపం, అరవడం వంటివి చేస్తే ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల కూడా విడాకులు తీసుకోవాలి అనుకుంటారు. ఒత్తిడి వల్ల అరిచిన అర్థం చేసుకొని తిరిగి మీ తప్పును తెలుసుకొని వారి వద్దకు వెళ్లి సారీ చెబితే మీ సమస్య పరిష్కారం అవుతుంది.

కోపం,సమయం.. మితిమీరిన కోపం, అహం కూడా మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. కాస్త సమయం కూడా మీ భాగస్వామి కోసం వెచ్చించాలని గుర్తు పెట్టుకోండి. సరదాగా మాట్లాడటం, కాసేపు బయటకు వెళ్లడం వంటివి చేస్తుంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. లేదంటే విడాకుల వరకు ఆలోచిస్తుంటారు.

డబ్బులు, రహస్యాలు.. డబ్బు కూడా విడాకులకు ప్రధాన కారణం. మితిమీరిన అప్పులు, జల్సాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు. కొందరు డబ్బు మీద మితిమీరిన ఆశ ఉండటం వల్ల భాగస్వామిని దూరం చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. మీకు సంబంధించిన విషయాలు ఇతరులు చెబితే అప్పుడు మీ మీద భాగస్వామికి నమ్మకం పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కూడా విడాకులు తీసుకునే ఆస్కారం ఉంటుంది. అనుమానం ఉన్నా కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉంది. మీకు మీ భాగస్వామి మీద అనుమానం ఉంటే మాట్లాడి సాల్వ్ చేసుకోండి. లేదంటే ఈ అనుమానం పెనుభూతంలా మారి మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది.