Women Term Policy: భారతదేశంలో ఉండే మహిళలు ఎంతో ఓపికతో ఉంటారని కొందరు చెబుతూ ఉంటారు. కష్టనష్టాలను ఎదుర్కొంటూ కుటుంబ బాధ్యతలను మోస్తూ ఉంటారని పేర్కొంటారు. కొన్ని సందర్భాల్లో దురదృష్టవశాత్తు కుటుంబ పెద్ద కు ఏదైనా జరిగితే ఆ భారాన్ని మొత్తం మోస్తూ తమ పిల్లలను పెంచుతూ ఉంటారు. వారికి చక్కని చదువును అందిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో వారి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. వారికి ఏదైనా చిన్న అనారోగ్యం జరిగితే నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఒక్కో సందర్భంలో ఇది పెద్దదిగా మారి అనేక ఖర్చులకు దారితీస్తుంది. అయితే ఇలాంటి సమయంలో చేతిలో డబ్బు ఉండదు. దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే తమ పిల్లలు అనాథ లుగా మిగిలిపోతారు. మరి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మహిళలు తమ పిల్లల కోసం ఎలాంటి ప్రయత్నం చేయాలి?
పురుషులు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఫీల్డ్ మీదికి వెళుతుంటారు. దీంతో వీరికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ శాతం ఒక కుటుంబంలో పురుషులు మాత్రమే ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆ భారాన్ని భరించడానికి ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉన్నారు. పురుషులు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వారి కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మహిళలు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే దురదృష్టం పురుషులకే కాదు మహిళలను వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ జరగరానిది జరిగితే.. అప్పుడు కుటుంబం పై భారం పడకుండా మహిళలు కాపాడే అవకాశం ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది.
Also Read: కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోట్లు.. సంచలన క్లారిటీ ఇచ్చిన కేంద్రం
అదే Women Term Policy. ప్రస్తుత కాలంలో మహిళలు ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులు చేసే ప్రతి వ్యాపారం కూడా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో పురుషులతో పాటు మహిళలకు కూడా రిస్కు ఉన్నదని గ్రహించుకోవాలి. అయితే చాలామంది మహిళలు టర్మ్ పాలసీ తీసుకోవడానికి ముందుకు రారు. కానీ మహిళలు ఈ పాలసీ తీసుకోవడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
పురుషులు టర్మ్ పాలసీ తీసుకుంటే కేవలం నామిని అయినా వారికి మాత్రమే బెన్ఫిట్ మొత్తం వస్తుంది. కానీ మహిళలు టర్మ్ పాలసీ తీసుకుంటే వారికి 60 ఏళ్ల వరకు రిస్కు మెచ్యూరిటీ మాత్రమే కాకుండా.. ఈ కాలంలో ఏదైనా కష్టతరమైన అనారోగ్యానికి గురైతే వాటికీ కూడా వర్తించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఉమెన్ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా పిల్లలకు కూడా ఉపయోగకరంగా ఉండనుంది. వీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే వారి పిల్లల చదువు కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని జమ చేస్తారు. ఇది వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో నెలవారి పద్ధతిన రూ.300 చెల్లించే టర్ము పాలసీలు ఉన్నాయి. అయితే వారి వయసు, మెడికల్ సర్టిఫికెట్ ప్రకారంగా ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రీమియం పాలసీని బట్టి మెచ్యూరిటీ అమౌంటు వచ్చే అవకాశం ఉంటుంది. టర్ము పాలసీలను ఏజెంట్ ద్వారా మాత్రమే కాకుండా ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చును.