4G And 3G Phones: కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. కొత్తగా ఏది వచ్చినా పాతవి కనుమరుగవ్వాల్సిందే. ముఖ్యంగా టెక్నాలజీలో మార్పును స్వాగతిస్తూ పాత వాటిని వదిలించుకోవాల్సిందే. అలా చేయకుంటే వెనుకబడి పోతాం. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లు కొత్తవి రాగానే పాతవి అమ్మేస్తుంటారు జనాలు. కొత్త టెక్నాలజీతో కొత్తవి కొని వాడుతుంటారు. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ వాడిన మనం.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం. అప్డేట్ కాకపోతే అదే ల్యాండ్ ఫోన్ వద్దే ఆగిపోయేవాళ్లం. అయ్యాం కాబట్టే ఇప్పుడు వీధుల్లో ‘ఎస్.టీడీ, ఐఎస్.డీ’ బూతులు కనుమరుగయ్యాయి.

మన జీవితాలను సుఖమయంగా.. ఆనందంగా మార్చే టెక్నాలజీ విషయంలో చదువు వచ్చినవాళ్లు అయినా.. రాని వాళ్లు అయినా అప్డేట్ కావాల్సిందే. లేకుంటే ఆ టెక్నాలజీనే సంస్థలు నిలిపివేస్తున్న పరిస్థితి. ఒకప్పుడు 2జీ తో సెల్ ఫోన్లు ప్రారంభయ్యాయి. కీప్యాడ్ తో ఉండే ‘నోకియా’ ఫోన్లే అప్పుడు గొప్ప. అవి ఉంటే బడాబాబుగా చూసేవారు. కానీ తర్వాత 3జీతో ఇంటర్నెట్ వచ్చింది. 1జీబీకి 300 వరకూ చెల్లించి నెల అంతా వాడేవాళ్లం. ఆ తర్వాత జీయో రాకతో 4జీ చేరువ అయ్యింది. ఒక డిజిటల్ విప్లవమే వచ్చేసింది. తాజాగా ప్రధాని మోడీ 5జీని దేశంలో లాంచ్ చేశాడు. దీంతో అందరిలోనూ డౌట్ ఒక్కటే.. ఇన్నాళ్లు దేశంలో వాడిన 3జీ, 4జీ సేవలు ఉంటాయా? వాటిని ఏం చేస్తారన్నది.
అయితే 4జీ సేవలు ఉంటాయి. ఎందుకంటే 5జీ అనేది ఖచ్చితంగా కొన్ని అడ్వాన్స్ ఆ ఫీచర్ ఉండే ఫోన్లలోనే వస్తుంది. ఇప్పుడు మనం వాడేవి కేవలం 4జీ ఫోన్లలో 5జీ రావడం లేదు. ఆ స్పీడు అందుకోవాలంటే కొత్త ఫోన్ మార్చాలి.

అయితే 5జీ రాకతో అందరూ అయితే 4జీకి, లేదంటే 5జీకి మారాల్సిందే. క్రమంగా 3జీ సేవలను, ఫోన్లను కంపెనీలు నిలిపివేస్తాయి. ఇప్పటికిప్పుడు నిలిపివేయకున్నా కానీ వాటిని క్రమంగా తగ్గించేస్తాయి. కొద్దిరోజుల్లోనే 3జీని ఎవరూ వాడకుండా చేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా అందరూ 4జీ, 5జీలోనే ఉంటారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు పాత వాటిని క్రమక్రమంగా తగ్గించడం సంస్థలకు అలవాటు. అదే జరుగుతుంది.