Friday: ఒక్కో మతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మన భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ అన్ని మతాలు కూడా ఉంటాయి. ఒక్కో మతం వారు ఇంకో మతాన్ని గౌరవిస్తారు. అలాగే ఒక్కో మతానికి ఒక్కో ప్రత్యేకమైన రోజు ఉంటుంది. ఉదాహరణకు హిందువులకు అన్ని రోజులు ప్రత్యేకమైనవే. కానీ ఒక్కో దేవుని బట్టి ఒక్కో రోజు ఉంటుంది. అదే క్రిస్టియన్లకు అయితే ఆదివారం చాలా స్పెషల్. ఆదివారం రోజు చర్చ్‌కు తప్పకుండా వెళ్తుంటారు. హిందువులు పండుగ బట్టి టెంపుల్‌కి వెళ్తారు. కానీ ఎక్కువగా సోమవారం, శనివారం రోజుల్లో టెంపుల్‌కి వెళ్తుంటారు. అదే ముస్లింలు అయితే రోజూ ప్రార్థన చేసుకోవడానికి మసీదుకి వెళ్తుంటారు. రోజులో రెండు నుంచి మూడు సార్లు మసీదుకి వెళ్లి నమాజ్ చేసుకుంటారు. ఇదంతా పక్కన పెడితే ముస్లింలకు శుక్రవారం చాలా ప్రత్యేకమైనది. ఎక్కువ శాతం మంది రోజూ మసీదుకి వెళ్లడానికి సమయం లేకపోతే శుక్రవారం అయితే అసలు మిస్ కారు. ముస్లింలకు అసలు ఎందుకు శుక్రవారం? దీని వెనుక ఏదైనా కారణం ఉందా? అనే పూర్తి విషయాలు ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.
శుక్రవారం రోజు ఎక్కడ మసీదులు చూసిన పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ముస్లింలకు శుక్రవారం చాలా ప్రత్యేకమైనదని జుడాయిజం, ఇస్లాంలో ఉంటుంది. ఈ రోజున రెండు మతాల వారు కూడా ఎంతో విశ్వాసంతో ఉంటారు. వారంలోని ఇతర రోజుల కంటే శుక్రవారమే వీరికి ముఖ్యమైనది. ఒకరి పాపాలను క్షమించమని అడగడానికి, అలాగే చేసిన పాపాలను పొగోట్టుకోవడానికి శుక్రవారం ప్రార్థన ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ప్రార్థన చేయడం వల్ల అన్ని పాపాలు తొలగి పోతాయని నమ్ముతారు. అలాగే ఇస్లాం ప్రవచనాలు వినడానికి అందరూ కలిసి ఒక దగ్గర ఉండి మరి ప్రార్థన చేస్తారు. జీవితంలో ఉన్నతంగా ఉండాలంటే శుక్రవారం ప్రార్థన అల్లా ఆశీస్సులు అందుతాయని నమ్ముతారు. అందుకే వీరు శుక్రవారాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
యూదులు ఎక్కువగా శుక్రవారం రోజు షబ్బత్‌ను జరుపుకుంటారు. షబ్బత్ అంటే ఒక వేడుక అలాగే ప్రార్థన చేసుకునే రోజు. ఈ షబ్బత్ యూదులకు చాలా పవిత్రమైనది. శుక్రవారం సూర్యాస్తమయం వద్ద ప్రారంభమై శనివారం సాయంత్రం హవ్‌దలాతో ముగుస్తుంది. అయితే ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత దేవుడు విశ్రాంతి తీసుకున్నందుకు ఈ షబ్బత్ జరుపుకుంటారట. అలాగే దీనివల్ల జీవితంలో విశ్రాంతి, ఆనందం అన్ని లభిస్తాయని నమ్ముతారు. అందుకే శుక్రవారం రోజు ముస్లింలు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. చాలా దేశాల్లో శుక్రవారం రోజు సెలవు ఉంటుంది. షబ్బత్ అనేది యూదుల జీవితానికి పునాది. దీనివల్ల అందరూ కూడా మంచి పొజిషన్‌లో ఉంటారని ముస్లింలు నమ్ముతారు. అందుకే షబ్బత్‌ను నిర్వహిస్తారు. ఎంతో భక్తితో అల్లాను ప్రార్థిస్తారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.