Wedding Card :పెళ్లి అనేది పవిత్రమైన బంధం. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వేదమంత్రాల సాక్షిగా పెళ్లి (Marriage) చేస్తారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవితాంతం ఎలాంటి గొడవలు లేకుండా బతకాలని కోరుకుంటారు. అందుకే పెళ్లిలో ఒక్కో కార్యక్రమం చేస్తూ వాటి గొప్పతనాన్ని తెలియజేస్తారు. పెళ్లిలో (Marriage) జరిగే ఒక్కో కార్యక్రమానికి ఒక్కో అర్థం కూడా ఉంటుంది. పూర్వం రోజుల నుంచి పెళ్లికి కార్డులు ప్రింట్ చేస్తున్న ఆనవాయితీ ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు వారి స్థోమతను బట్టి కార్డులు ప్రింట్ చేయిస్తారు. ఇప్పుడంటే కొత్త కొత్త కార్డులు ప్రింట్ చేస్తున్నారు. అప్పటిలో అది ఒక సంప్రదాయంగా కార్డులను కొట్టించేవారు. కానీ ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా ప్రింట్ చేస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా పెళ్లి కార్డును గమనించారా? అందులో వరుడిని చిరంజీవి అని, వధువుని ఆయుష్మతి అని రాసి ఉంటుంది. వరుడు, వధువు పేర్లకు ముందు ఇవి ఉంటాయి. ఆ తర్వాత వారి పేర్లు ఉంటాయి. అయితే హిందూ సంప్రదాయంలో ఎన్నో పేర్లు ఉండగా.. వీటినే ఎందుకు వాడుతున్నారు? దీనికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పూర్వం బ్రాహ్మణ దంపతులు సంతానం కోసం మహామాయను పూజించేవారట. అయితే వారి ప్రార్థనలకు తృప్తి చెందిన మహామాయ దంపతులు ముందు కనిపించాడు. అప్పుడు ఆ బ్రహ్మణ దంపతులకు రెండు వరాలు ఇచ్చాడు. మహామాయ అతనికి మూర్ఖుడు, దీర్ఘాయువు ఉన్న కొడుకు కావాలా? లేకపోతే కేవలం 15 సంవత్సరాల వరకు మాత్రమే జీవించే తెలివైన కొడుకు కావాలా అని అడిగాడు. అయితే అప్పుడు ఆ దంపతులు రెండవ వరం కావాలని మహామాయకు చెప్పాడు. కోరిన విధంగా మహామాయ ఆ దంపతులకు కొడుకు ఇచ్చాడు. బిడ్డ పుట్టినందుకు సంతోషం అనిపించినా ఎప్పుడో ఒకసారి ప్రాణం పోతుందనే విషయం తెలిసి తల్లిదండ్రులు కుమిలిపోయేవారు. అయితే ఆ దంపతులు కొడుకుని చదువు కోసం కాశీకి పంపారు. అక్కడ కొడుకు ఒక ధనవంతుడి కూతురుతో ప్రేమలో పడ్డాడు. ఈ అమ్మాయి మహామాయకు అమితమైన భక్తురాలు. మహామాయ ఆశీర్వాదం ప్రకారం వారి పెళ్లి రోజున ఆ యువకుడి జీవితం ముగిసింది. అతని ప్రాణం తీయడానికి యమరాజన్ పాము రూపం ధరించి యువకుడి దగ్గరకు వచ్చాడు. ఇది చూసిన యువకుడి భార్య పాము రూపంలో ఉన్న యమరాజును పెట్టెలో బంధించింది. దీంతో యమలోకం నిశ్చలంగా మారింది. తన భర్త ప్రాణాలను కాపాడమని మహామాయను ప్రార్థించింది. అప్పుడు మహామాయ ప్రత్యక్షమై యమరాజును విడిపించమని కోరాడు. ఆ భార్య కోరిక మేరకు అతనికి ప్రాణం తిరిగి ఇచ్చి చిరంజీవి అని ఆశీర్వదించాడు. అలా అబ్బాయి పేరు ముందు చిరంజీవి అని పేరు రాస్తారు.
పూర్వం ఓ రాజుకి పిల్లలు లేరు. ఆ సమయంలో నారదుడి సూచన మేరకు యాగం చేశాడు. బంగారంతో నాగలి చేసి దానితో భూమిని దున్నుతారు. అయితే భూదేవి అతనికి ఓ కుమార్తెను బహుమతిగా ఇచ్చింది. ఇద్దరూ కలిసి భవనానికి వెళ్తుండగా మధ్యలో సింహం ఆ పాపను నోటిలోకి తీసుకుంటుంది. ఈ సమయంలో ఆ అమ్మాయి తామర పువ్వులా మారిపోతుంది. దీంతో అక్కడ విష్ణువు ప్రత్యక్షమై తామరపువ్వును తాకుతాడు. అప్పుడు ఆ అమ్మాయి 25 ఏళ్ల అందమైన మహిళగా మారిపోయింది. రాజు తన కుమార్తెను విష్ణువుకు ఇచ్చి వివాహం చేస్తాడు. యమరాజన్ ఆ అమ్మాయిని ఆయుష్మతిగా పిలుస్తాడు. ఈ కథ వల్ల వివాహ లేఖలలో వధువు పేరు ముందు ఆయుష్మతి అని రాస్తారని పురాణాలు చెబుతున్నాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.