Saffron : కుంకుమ పువ్వును ఎక్కువగా గర్భిణులు (Pregnancy) ఉపయోగిస్తుంటారు. దీని ఖరీదు చాలా ఉంటుందనే విషయం మనలో చాలా మందికి తెలిసిన విషయమే. దీన్ని బంగారంతో పోలుస్తారు. బంగారం ఎంత విలువైనదో కుంకుమ పువ్వు (Saffron) అంత కన్న విలువైనదిగా భావిస్తారు. ఇది ఒక సుగంధ ద్రవ్యం. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా గర్భిణులు (Pregnancy) ఉపయోగిస్తారు. పాలలో కలిపి తాగుతారు. ఇలా తాగడం వల్ల పిల్లలు తెల్లగా పుట్టడంతో పాటు గర్భిణుల ఆరోగ్యానికి మంచిదట. అయితే ఇది చాలా ఖరీదు ఉండటంతో కొందరు తక్కువగా తీసుకుంటారు. అసలు ఈ కుంకుమ పువ్వలో (Saffron) అంత ఎక్కువ పోషకాలు ఉన్నాయా? ఎందుకు ఇది అంత ఖరీదు? దీనికి గల కారణం ఏంటి? దీన్ని దేనికి చిహ్నంగా భావిస్తారో పూర్తి విషయాలు తెలుసుకుందాం.
కుంకుమ పువ్వును ఎక్కువగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు. పువ్వులోని కేసరాలను తీసి ఎండబెట్టి కుంకుమ పువ్వును తయారు చేస్తారు. దీన్ని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఒక కేజీ కేసరాలు కావాలంటే దాదాపు రెండు లక్షల పువ్వులు కావాలి. దీనికి చాలా శ్రమ ఉంటుంది. ఈ కారణం వల్లనే కంకుమ పువ్వు చాలా ఖరీదు. కుంకుమ పువ్వులోని కేసరాలు రుచికి కాస్త చేదుగా ఉండటంతో పాటు తియ్యగా కూడా ఉంటాయి. ఈ కుంకుమ పువ్వును సాగు చేయడం చాలా కష్టం. అలాగే వీటి విత్తనాలను 15 ఏళ్లకు ఒకసారి నాటాలి. కుంకుమ పువ్వు పంట ప్రతీ ఏడాది చేతికి వస్తుంది. ఈ పువ్వులను ఏడాదికి ఒకసారి వస్తుంది. కేవలం ఒక్క గ్రాము కుంకుమ పువ్వు పండించాలన్నా కూడా చాలా కష్టపడాలి. అందుకే ఈ కుంకుమ పువ్వు గ్రాముల కూడా చాలా ఖరీదు ఉంటాయి. కుంకుమ పువ్వను శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఇతర రంగుల పువ్వుల కంటే కుంకుమ పువ్వు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీని పువ్వులను సంతోషానికి కూడా చిహ్నంగా భావిస్తారు.
కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులోని పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవి ఎక్కువగా శీతల ప్రాంతంలో పండిస్తారు. దక్షిణ భారత దేశంలో కంటే ఉత్తర భారతదేశంలో ఈ కుంకుమ పువ్వును పండిస్తారు. ఉత్తర భారత దేశంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. మన దేశంలో జమ్మూకశ్మీర్‌లో కుంకుమ పువ్వును సాగు చేస్తుంటారు.