Viral Video : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా.. మరికొన్ని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఇలా జరగాల్సిన అవసరం ఏంటి? ఇలా జరగకుండా ఉండి ఉంటే బాగుంటుంది కదా? అనే ప్రశ్నలు మన మదిలో తలెత్తుతున్నప్పటికీ.. అటువంటి వాటిని జరగకుండా నిరోధించడం సాధ్యం కావడం లేదు. అందువల్లే ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ.. చాలామంది చూసుకుంటూ వెళ్తున్నారు. అయితే అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. కాకపోతే ఆ ఘటన జరిగిన తర్వాత.. అసలు నిజం తెలిసి చాలామంది నోళ్ళు మూసుకున్నారు.
పెళ్లి చేసేసారు
పశుమేగాల్లో మౌలానా అబుల్ కలాం యూనివర్సిటీ ఉంది. ఈ విశ్వవిద్యాలయానికి మంచి పేరు ఉంది. ఇందులో చదవడానికి మనదేశంలో ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటారు. ఇక్కడ విద్యాబోధన సక్రమంగా ఉండడంతో.. చాలామంది విద్యార్థులు చదవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. పైగా ఇక్కడ విభిన్నమైన కోర్సులు అందుబాటులో ఉంటాయి. అందువల్లే ఈ విశ్వవిద్యాలయం దేశవ్యాప్తంగా పేరు పొందింది. అయితే ఈ విశ్వవిద్యాలయంలో ఓ లేడీ ప్రొఫెసర్ క్లాస్ రూమ్ లో ఓ విద్యార్థి ని వివాహం చేసుకుంది. వినడానికి దిగ్భ్రాంతిని కలిగిస్తున్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.. పైగా తోటి విద్యార్థులు దగ్గరుండి ఈ వివాహాన్ని జరిపించారు. అయితే ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి తెలియడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ మొదలుపెట్టింది. అయితే అసలు విషయం తెలిసేసరికి కంగుతిన్నది. ఎందుకంటే ఒక డ్రామా ప్రాజెక్టులో భాగంగా ఈ వివాహాన్ని జరిపించారట. అందులో జరుగుతున్న యదార్ధాన్ని విద్యార్థులకు వివరించడానికి ఈ నాటకం ఆడారట. అయితే కొంతమంది ఈ వివాహాన్ని వీడియో తీసి సీక్రెట్ గా కాలేజీ యాజమాన్యం గ్రూపులో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై ఆ లేడీ ప్రొఫెసర్ మండిపడుతున్నారు. సైకాలజీ డిపార్ట్మెంట్ పరువు తీసారని.. సీక్రెట్ గా చేస్తున్న ఆపరేషన్ మొత్తాన్ని బయటపెట్టారని.. ఇది సరైన చర్య కాదని ఆమె మండిపడ్డారు..” విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పెళ్లి నాటకం ఆడాం. చివరి వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం. కానీ కొంతమంది దీనిని సీక్రెట్ గా వీడియో తీసి మా ప్లాన్ మొత్తం నాశనం చేశారు. సైకాలజీ డిపార్ట్మెంట్ పరువు మొత్తం తీశారు. విద్యార్థులకు అవగాహన కల్పించడానికి తప్ప.. ఇందులో వేరే ఉద్దేశం లేదు. దీన్ని వేరే విధంగా ఆపాదించుకుంటే చేసేది కూడా ఏమీ లేదని” ఆ లేడీ ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. అయితే ఇది నాటకమో? నిజమో? తెలుసుకోవడానికి విశ్వవిద్యాలయ యాజమాన్యం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ నిజానిజాలు తెలుసుకునే పనిలో పడింది.