Keyboard : నేటి డిజిటల్ యుగంలో, రాయడానికి పెన్ను, కాగితాన్ని కీబోర్డ్ లాగేసుకుంది. మనం కీబోర్డ్ మీద టైప్ చేయడం ఎంతగా అలవాటు పడ్డాం అంటే కళ్ళు మూసుకుని కూడా చాలా వేగంగా టైప్ చేయగలం. కానీ టైప్ చేస్తున్నప్పుడు, కీబోర్డ్ (QWERTY కీబోర్డ్) లోని అక్షరాలు వరుస క్రమంలో ఎందుకు అమర్చబడలేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చిన్నప్పుడు మనకు A, B, C, D వంటి వరుసక్రమంలో ఇంగ్లీష్ అక్షరాలను నేర్పించేవారు… కానీ కీబోర్డ్‌లో మనం వేరేదాన్ని చూస్తాము. ఇది ఎందుకు అలా ఉంటుంది? (మనం QWERTY కీబోర్డులను ఎందుకు ఉపయోగిస్తాము)? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం.
Also Raed : కంప్యూటర్ కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఎందుకుండవో తెలుసా..?
ABC నుంచి QWERTY కి ప్రయాణం
మొదటి టైప్‌రైటర్‌ను 1868లో క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ కనుగొన్నారు. ఆ సమయంలో టైప్‌రైటర్ కీబోర్డ్‌లోని అక్షరాలు ABCD క్రమంలో అమర్చారు. ఈ అమరిక తార్కికంగా అనిపించింది. ఎందుకంటే ప్రజలు అక్షరాల క్రమాన్ని ఇప్పటికే గుర్తుంచుకున్నారు. ఇది టైపింగ్‌ను సులభతరం చేసింది.
అయితే, త్వరలోనే ఒక పెద్ద సమస్య తలెత్తింది. ఆ కాలంలో టైప్‌రైటర్లు యాంత్రికంగా ఉండేవి. బటన్లు మెటల్ పిన్‌లకు అనుసంధానమై ఉండేవి. ప్రజలు వేగంగా టైప్ చేసినప్పుడు, సమీపంలోని బటన్ల పిన్నులు ఒకదానికొకటి చిక్కుకుపోయేవి, దీనివల్ల టైప్‌రైటర్ జామ్ అయ్యేది. దీని వలన పని ఆగిపోవడమే కాకుండా యంత్ర భాగాలు దెబ్బతినడం ప్రారంభమైంది. దీని వల్ల కొంతకాలం తర్వాత ప్రజలు టైప్‌రైటర్‌ను ఉపయోగించడం చాలా కష్టమైంది. ఇప్పుడు మీకు ABC ని వదిలివేసి QWERTY కీబోర్డ్‌ను ఎందుకు స్వీకరించాల్సి వచ్చిందో కొంత ఆలోచన వచ్చి ఉండవచ్చు.
QWERTY కీబోర్డ్ ఇలా మొదలైంది
ఈ సమస్యను అధిగమించడానికి, షోల్స్ 1873 లో కొత్త కీబోర్డ్ లేఅవుట్‌ను రూపొందించాడు. దీనిని నేడు QWERTY కీబోర్డ్. ఈ లేఅవుట్ ముఖ్య ఉద్దేశ్యం టైపింగ్ వేగాన్ని తగ్గించడం, తద్వారా బటన్లు ఒకదానికొకటి చిక్కుకోకుండా ఉండటంగా తెలిపారు.
QWERTY లేఅవుట్ ముఖ్యాంశాలు
తరచుగా ఉపయోగించే అక్షరాలు ఒకదానికొకటి దూరంగా ఉంచారు. E, A, O లాగా, I అక్షరాలు ఒకదానికొకటి దూరంగా ఉంచారు. తద్వారా వేళ్లు పదే పదే ఒకే ప్రదేశానికి చేరుకోకుండా ఉంటాయి. తక్కువగా ఉపయోగించే అక్షరాలు (Z, X, Q వంటివి) చేరుకోవడానికి కష్టంగా ఉండే ప్రదేశాలలో ఉంచారు, దీనివల్ల టైపింగ్ నెమ్మదిగా ఉంటుంది. చాలా మంది కుడి చేతితో వేగంగా టైప్ చేయడం వల్ల టైప్ రైటర్ జామ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ఎక్కువ టైపింగ్ ఎడమ చేతితోనే జరిగింది.
QWERTY కీబోర్డ్ ఇప్పటికీ ఎందుకు పనిచేస్తుంది?
నేటి కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లలో మెకానికల్ జామింగ్ సమస్య లేదు. అయినప్పటికీ QWERTY కీబోర్డులను ఉపయోగించడం కొనసాగుతోంది. దీని వెనుక కారణం ప్రజల అలవాట్లు, ప్రామాణీకరణే అంటారు నిపుణులు. ప్రజలు ఈ లేఅవుట్‌ను దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. సో దానిని మార్చడం కష్టమే.
Also Read : ఇక ఏది పడితే అది రాయడం కుదరదు.. సోషల్ మీడియాకు, మీడియాకు ఇదే కేంద్రం హెచ్చరిక