LPG Gas : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఎల్‌పీజీ గ్యాస్ (LPG Gas) ఉంటుంది. పూర్వం రోజుల్లో అయితే కట్టెల పొయ్యి ఉండేది. కానీ ఈ రోజుల్లో మాత్రం ఎక్కువగా గ్యాస్ వినియోగిస్తున్నరు. వీటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రతీ నెలా వీటి ధరల్లో మార్పులు వస్తుంటాయి. అయితే ఎల్‌పీజీ (LPG Gas) వాయువు శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి అవుతుంది. వంట చేసేటప్పుడు తప్పకుండా దీన్ని ఉపయోగిస్తారు. అలాంటి సమయంలో గ్యాస్ నుంచి కొన్ని రంగుల్లో (Colours) మంట వస్తుంది. ఎరుపు నిప్పుతో పాటు నీలం రంగులో మంట వస్తుంది. సాధారణంగా మంట అనేది ఎరుపు రంగులో మండుతుంది. కానీ గ్యాస్ సిలిండర్‌పై మంటలు మాత్రం బ్లూ కలర్‌లో ఉంటాయి. అసలు ఈ ఎల్‌పీజీ గ్యాస్ మంట బ్లూ కలర్‌లో (Blue Colour) ఎందుకు ఉంటుందనే విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? గ్యాస్ సిలిండర్ ఈ రంగులోనే ఉండటానికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎల్‌పీజీ అంటే ద్రవీకృత పెట్రోలియం వాయువు. ఇది పెట్రోలియంలో ఒక భాగం మాత్రమే. ఇందులో ప్రొపేన్, బ్యూటేన్ వాయువులు ఉంటాయి. ఈ మిశ్రమాన్ని ద్రవరూపంలో గ్యాస్ సిలిండర్‌లో నిల్వ చేస్తారు. ఇది గాలిలోకి వచ్చినప్పుడు పీడనం తగ్గి.. వాయువుగా మారుతుంది. అయితే ఈ గ్యాస్ సిలిండర్‌ను ఎక్కువగా వంటలకు ఉపయోగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇది సురక్షితం. కానీ దీన్ని జాగ్రత్తగా ఉపయోగించకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ఆన్ చేసి వదిలేస్తే మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అదే వంట అయ్యాక ఆఫ్ చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే గ్యాస్ మండుతున్నప్పుడు నీలం రంగు ఎక్కువగా వస్తుంది. దీనికి ఓ కారణం ఉందట. ఎందుకంటే దీపం లేదా కొవ్వొత్తి ఏదైనా కూడా అగ్గి చివరలో నీలం రంగులోకి మారుతుంది. మొదట్లో ఎరుపు, నారింజ, పసుపు, నీలం రంగులు కనిపిస్తాయి. కానీ అది చివరకు దహన ప్రక్రియ చెందుతుంది. ఈ కారణం వల్లనే నీలం రంగులోకి మారుతుంది. అలాగే గ్యాస్ వాయువుల్లో కార్బన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కార్బన్ ఎక్కువగా ఉన్న ఇంధనం ఎరుపు లేదా పసుపు రంగులో అగ్నిని కలిగి ఉంటుంది. అదే తక్కువగా ఉంటే బ్లూ కలర్ వస్తుంది. మీరు అగ్గిపెట్టె, బొగ్గు, నూనె దీపం మొదలైన వాటిని వెలిగించినప్పుడు కూడా అగ్ని నీలం, పసుపు, ఎరుపు వంటి రంగుల్లో కనిపిస్తుంది. ఈ ఎల్‌పీజీ గ్యాస్ వల్ల పొగ రాదు. దీని వల్ల కాలుష్యానికి ఎలాంటి నష్టం ఉండదు. ఎల్‌పీజీలోని ప్రొపేన్, బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్‌లు ఆక్సిజన్‌తో కలిసిన తర్వాత పూర్తిగా కాలిపోతాయి. ఇది ఎలాంటి కాలుష్యాన్ని లేదా పొగను ఉత్పత్తి చేయదు.