Boyfriend : ఎన్నో సార్లు ఊహించనివి జరుగుతాయి. ఈ సందర్బంలో ఆశ్చర్యానికి గురి అవుతాం. కొందరు కావలసిన వారు సర్ప్రైజ్ లు ఇస్తుంటారు. వాటిని ఊహించడం కూడా కష్టమే. కొన్నిసార్లు అది మనకు దగ్గరగా ఉన్న వ్యక్తి ప్లాన్ చేస్తారు. లేదా కొన్నిసార్లు అలా జరిగిపోతుంది. కానీ నిజంగా మనకు ఎవరు అయినా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే భలే అనిపిస్తుంది కదా. ఆ ఊహ కూడా భలే ఉందా? అయినా అందరికీ ఆ అదృష్టం ఉంటుందా అని అనుకుంటున్నారా? కానీ ఈ ఊహించని గిఫ్ట్ లో ఉండని కిక్కే వేరప్పా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే? ఓ ప్రియుడు ప్రియురాలికి భలే సర్పైజ్ ఇచ్చాడు.
అచ్చం ఇలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ మన దగ్గర కాదండోయ్ ఈ ఘటన చైనాలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే? పొరుగు దేశమైన చైనాలో ఒక అమ్మాయి విషయంలో ఇలానే జరిగింది. అయితే ఆమె ఏదో తినడానికి రెస్టారెంట్‌కి వెళ్ళింది. కానీ ఆమెకు జరిగింది చూసి షాక్ అయింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, తన ప్రియుడితో కూర్చున్న అమ్మాయి బహుశా చాలా ఆకలితో ఉండవచ్చు. అందుకే ఆమె తన ముందు ఉన్న కేక్ కొరికి తినడానికి ఆలోచించకుండానే లాగించేస్తుంద. ఈ ఆసక్తికరమైన సంఘటనలో తనకు ఓ వింత షాక్ తగిలింది.
ఈ సంఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లియు అనే అమ్మాయి ఒక రోజు ఇంటికి వచ్చింది. తనకు చాలా ఆకలిగా ఉందని తన ప్రియుడితో చెప్పింది. ప్రియుడు ఆమె కోసం మీట్ ఫ్లాస్ కేక్ తయారు చేసాడు. ఇక ప్రియుడి ప్రేమగా ఇచ్చిన కేక్ ను ఆకలి వేస్తుండగా ఎవరైనా తినకుండా ఉంటారా? అందుకే ఆమె కూడా లాగించేసింది. అదిగో అప్పుడే ఓ సంఘటన జరిగింది. దానిని కొరికి నమలు తుండగా ఏదో గట్టిగా అనిపించి వెంటనే దాన్ని బయటకు ఉమ్మివేసింది.
లియు మొదట్లో కేక్ పాడైందని, వెంటనే బేకరీ వాళ్ళతో మాట్లాడాలని అనుకుంది. అయితే ఆమె ప్రియుడు దానిని క్లీన్ చేసి నీకు ప్రపోజ్ చేయడానికి ఈ రింగ్ పెట్టాను అన్నాడు. అంతే ఇక సంతోషానికి అడ్డు లేదు. మొదట లియు దానిని జోక్ అనుకుంది. కానీ తరువాత అది బంగారు ఉంగరం అని గ్రహించి ఫుల్ గా సంతోషించింది.
ఈ వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఈ ప్రపోజల్ తన జీవితాంతం గుర్తుండిపోతుందని కొందరు, ఆ అమ్మాయి దంతాలు చిరుత దంతాల కంటే స్ట్రాంగ్ అని కొందరు, ముసలి తనం వచ్చినా సరే ఈ ప్రపోజల్ ను మాత్రం లియు మర్చిపోదు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.