Diwali 2022: హిందూ మతంలో ముఖ్యమైన పండుగలలో దీపావళి కూడా ఒకటి. ఐదు రోజుల పాటు నిర్వహించుకునే దీపావళిలో పూజలకే ప్రాముఖ్యత ఉంటుంది. అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించి తమకు అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీపావళి పండుగకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. దీంతో దీపావళి పండుగ అంటే అందరికి ఇష్టమే. దీపావళి అంటే దీపాల పండుగ. ఇంటి ఆవరణ అంతా దీపాల కాంతులతో విరాజిల్లుతుంది. దీపావళి రోజు లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీ.

దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవితో పాటు గణేషున్ని పూజిస్తారు. రాత్రి వేళల్లో లక్ష్మీదేవితోపాటు వినాయకుడిని పూజిస్తే మనకు ఎన్నో శుభాలు కలుగుతాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కుబేరుడు, సరస్వతి, కాళీ మాతను పూజిస్తుంటారు. లక్ష్మీదేవి పూజ చేస్తే ఆర్థిక లోటు ఉండదని చెబుతారు. జీవితంలో కీర్తి ప్రతిష్టలు ద్విగుణీకృతం కావాలంటే లక్ష్మీదేవిని కొలవడం తప్పనిసరి. లక్ష్మీదేవి ఉంటే విష్ణుమూర్తిని కూడా పూజించాలి కదా అనే అనుమానం అందరికి వస్తుంది. కానీ ఈ సమయంలో విష్ణుమూర్తి నిద్రపోతాడట.
దీపావళి రోజు లక్ష్మీదేవి పూజకంటే ముందు వినాయకుడిని పూజిస్తారు. విష్ణుమూర్తి అందుబాటులో ఉండకపోవంతో గణపతిని పూజిస్తారు. లక్ష్మీగణపతి పూజతో మనకు ఎంతో మేలు కలుగుతుందని నమ్ముతారు. అందుకే వారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. చాతుర్మాస సమయంలో విష్ణుమూర్తి నిద్రపోవడంతో ఆయనకు ఏ పూజలు చేయరు. అందుకే గణేషుడికి ముందు పూజ చేసి తరువాత లక్ష్మీదేవిని కొలవడం చేస్తుంటారు. దీంతో దీపావళి పండుగ రోజులలో లక్ష్మీదేవి పూజ చేస్తే ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.

విష్ణువు తిరిగి వైకుంఠానికి వస్తాడట. అందుకే కార్తీక పూర్ణిమ రోజున వైకుంఠ తలుపులు తెరుస్తారు. పూజా కార్యక్రమాల్లో విష్ణువును ఇక ఆ రోజు నుంచి కొలుస్తుంటారు. విష్ణు నామస్మరణతో ఆలయాలు మారుమోగుతాయి. ఆలయాల్లో పలు కార్యక్రమాలు చేపడతారు. దీపావళి పండుగ విలువను తెలుసుకుని అందరు ఎంతో నియమ నిష్టలతో పూజలు చేసి లక్ష్మీదేవిని కొలిచి తమకు ధన ప్రాప్తి కలగాలని కోరుకుంటారు. వారి కోరికలను ఆమె తీరుస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం.