Chukka Koora Health Benefits: మనదేహానికి మాంసాహారం కంటే శాఖాహారమే మేలు చేస్తుంది. కానీ మనుషులు మాంసాహారానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. ఆహార జీవన శైలి అదుపు తప్పడంతోనే మధుమేహం, రక్తపోటు, గుండెపోటు తదితర రోగాలు మన దరిచేరుతున్నాయి. కానీ మనలో మాత్రం మార్పు రావడం లేదు. వందేళ్లు బతకాల్సిన శరీరం యాభై ఏళ్లకే పరిమితమైపోతోంది. దీనికి ప్రధాన కారణం మన ఆహార అలవాట్లే అని కచ్చితంగా చెప్పొచ్చు. మనం తీసుకునే ఆహారంలో నూనె, ఉప్పు, కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు కేంద్రంగా అవుతున్నాం. దీంతో మన భవిష్యత్ అంధకారమే అవుతోంది. పాతికేళ్లకే రోగాల బారిన పడుతూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నాం.

మనం తీసుకునే ఆహారాల్లో కూరగాయలు ముఖ్యమైనవే. కానీ వాటికంటే కూడా బలమైనవి ఆకుకూరలు. ఆకుకూరలతో మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. ఇందులో తోటకూర, పాలకూర, బచ్చలికూర, తుంటికూర, చుక్కకూర ఉన్నాయి. చుక్కకూర మనకు ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఇందులో ఉండే ఎక్స్టాక్ట్స్, పాలీ పినాల్స్, గుండెలో బ్లాక్స్ రాకుండా చూసుకుంటాయి. 2020లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా దీనిపై ప్రత్యేకంగా పరిశోధన చేసి నిరూపించింది. చుక్కకూర తో మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని తేల్చింది.
ఇది రక్తనాళాల్లో అడ్డుగా వచ్చే బ్లాక్స్ లాగా అడ్డుకుంటాయి. రక్తనాళాల్లో ఆటంకాలు కొవ్వు వల్ల కాకుండా ప్లేట్ లెట్స్ వల్ల కూడా జరుగుతుంది. రక్తపోటు ఉన్న వారికి కూడా ఇది మంచి ఆహారంగా మారుతుంది. బీపీని కంట్రోల్ లో ఉంచడంలో తోడ్పడుతుంది. రక్తనాళాల్లో ఉండే ఎండో తీలియం సెల్ సిగ్నల్స్ గా మార్చి నైట్రిక్ ఆక్సైడ్ సెల్ బాగా పెరిగేటట్లు సాయపడుతుంది. చుక్కకూరపై 2017లో చైనా కూడా పరిశోధన చేసి బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. రక్తహీనత సమస్య దూరం అవుతుంది. కంటికి బాగా పని చేస్తుంది.

ఇందులో ఉండే యాంట ఆక్సిడెంట్లు క్యాన్సర్ సెల్స్ ను చంపుతాయి. దీనిపై కూడా 2012లో హంగేరి దేశం వారు నిరూపించారు. వంద గ్రాముల చుక్క కూర తీసుకుంటే అందులో 90 శాతం నీరే ఉంటుంది. కార్బోహైడ్రేడ్లు 3 గ్రాములు, ప్రోటీన్లు 1.6 గ్రాములు, కొవ్వు 1.2 గ్రాములు, విటమిన్ సి 53 మి.గ్రాములు, విటమిన్ కె 126 మి.గ్రాములు, లుట్టిన్ 2370 మి.గ్రాములు, ఐరన్ 4 మి. గ్రాములు, మెగ్నీషియం 48 మి.గ్రాములు ఉన్నాయి. ఇన్ని పోషకాలు ఉన్న చుక్కకూరను వారంలో కనీసం మూడు సార్లయినా తీసుకుంటే మన దేహానికి ఎంతో ప్రయోజనం. దీన్ని గుర్తించి ప్రజలు ఎక్కువగా కూరల్లో వాడుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.