Homeలైఫ్ స్టైల్Dogs Cry: కుక్కలు అర్థరాత్రి ఎందుకు ఏడుస్తాయి

Dogs Cry: కుక్కలు అర్థరాత్రి ఎందుకు ఏడుస్తాయి

Dogs Cry
Dogs Cry

Dogs Cry: మనం పెంచుకునే జంతువుల్లో కుక్కలు ముందు వరసలో ఉంటాయి. ఇటీవల కాలంలో చాలా మంది ఇంట్లో కుక్కలు పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. అదే సామాజిక స్టేటస్ గా భావిస్తున్నారు. పెంపుడు జంతువుల్లో కుక్కలు, పిల్లులు, మేకలు, కోళ్లు వంటివి ఉంటాయి. వాటిని పెంచుకుని మనం కొంత లాభం పొందుతాం. మేకలు, కోళ్లు పెంచుకుంటే వాటిని అమ్మడం ద్వారా మనకు ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది. ఇక కుక్కల విషయానికి వస్తే కుక్కలను పెంచుకుంటూ వాటితోనే కాలక్షేపం చేసే వారు ఉండటం సహజమే. దీంతో కుక్కల పెంపకాన్ని అందరు అదో సరదాగా తీసుకుంటున్నారు. తమ ఇంట్లో కుక్క ఉంటే దొంగలు రారనే భావనతో ఉంటున్నారు.

కుక్కల ఏడుపు

ఎప్పుడైనా కుక్కల ఏడుపు విన్నారా? దాన్ని అశుభంగా భావిస్తారు. రాత్రి పూట అయితే విపరీతంగా ఏడుస్తుంటాయి. కుక్కలను చంపొద్దనే సర్కారు ఆదేశాలతో ప్రతి ఊళ్లో కుక్కల గుంపు మనుషులను భయపెడుతోంది. ఇటీవల హైదరాబాద్ లో వీధికుక్కలు నాలుగేళ్ల కుర్రాడిని చంపిన ఘటనలో ఎన్నో విమర్శలు వచ్చాయి. రాజస్తాన్ లో ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును లాక్కెళ్లి కరిచి చంపిన సంఘటన కూడా విధితమే. ఇలా కుక్కల స్వైర విహారంతో అందరు భయాందోళన చెందుతున్నారు.

Also Read: Team India Cricket: ఇలాగైతే టీమిండియా భవిష్యత్‌ ప్రశ్నార్థయమేనా? ఎవరిదీ తప్పు!

ఆత్మలు కనిపిస్తాయట

కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? కుక్కలకు ఆత్మలు కనిపిస్తాయట. అందుకే అవి ఏడుస్తుంటాయని చెబుతున్నారు. కుక్కల ఏడుపును అశుభంగా భావిస్తారు. పగటిపూట ఏడిస్తే తరుముతాం. కానీ రాత్రి సమయంలో ఎవరు లేచి వాటిని కొట్టే ప్రయత్నం చేయరు. ఇలా కుక్కల ఏడుపు సందేశం ఇచ్చేందుకే అలా చేస్తాయని చెబుతుంటారు. ఇంట్లో పెంచకునే కుక్కల కళ్లలో నుంచి నీళ్లు రావడం లేదా తినడం, తాగడం మానేస్తే ఇంట్లో బాధలు పెరుగుతాయని అంటారు. ఒంటరిగా ఉండే వారు కుక్కలను పెంచుకోవడం వల్ల వారికి ధైర్యం మిగులుతుందని చెబుతుంటారు.

Dogs Cry
Dogs Cry

కుక్కలను పెంచుకోవడం

ఇంట్లో పిల్లలు లేని వారు కుక్కలను పెంచుకోవడం వల్ల వారిలో కాస్త స్థైర్యం పెరుగుతుంది. వాటితో కలిసి ఉండటం ద్వారా వారి ఆయుష్షు కూడా పెరుగుతున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. ఒంటరిగా ఉండే వారు కుక్కలను పెంచుకోవడం వల్ల వారి మరణాలు 15 శాతం తగ్గాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గుండె జబ్బుల ముప్పు కూడా ఉండటం లేదట. దీంతోనే ఇళ్లలో కుక్కలను పెంచుకుంటున్నారు. కానీ వాటికి క్రమం తప్పకుండా టీకాలు ఇప్పించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తుంటాయని గుర్తుంచుకోవాలి.

Also Read: Minister Roja: మంత్రి రోజాపైకి కుక్క దాడికి యత్నం.. వీడియో వైరల్..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version