Garuda Puranam: భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. పుట్టుక గిట్టుట కొరకే అంటారు. అయితే మరణించిన తర్వాత మనం చేసిన మంచిచెడుల వల్లనే స్వర్గం నరకం అనే రెండింటిలో ఒకదానికి వెళ్తాం అని కూడా చెబుతారు పెద్దలు. మరి మరణించిన తర్వాత ఆత్మ ఏం అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు గరుడ పురాణంలో ఏం అని ఉన్నాయో ఓ సారి తెలుసుకుందామా..?
స్వర్గం నరకం అనే వాటి గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయితే ఆత్మకు అంతం లేదని భగవద్గీతలో ఉంటుంది. అయితే ఆత్మ శరీరాన్ని మారుస్తుందట. పంచేంద్రియాలతో తయారైన శరీరానికి మాత్రమే మరణం ఉంటుందని.. ఆత్మకు ఉండదని గరుడ పురాణం తెలుపుతుంది. ఇందులో 84 లక్షలకు పైగా నరకాలు ఉన్నాయని వాటిలో 21 నరకాలు మాత్రమే ప్రత్యేకమైనవి అని తెలుస్తోంది. భూమి మీద బతికి ఉన్నప్పుడు ఎక్కువ పాపాలు చేసిన మనుషులకు నరకంలో కఠినమైన శిక్షలు ఉంటాయట.
మతానికి విరుద్దంగా వ్యవహరిస్తే ఆ ఆత్మలు నరకానికి వెళ్తాయట. ఇక మరణించిన ప్రతి ఒక్కరి కర్మల ఆధారంగానే శిక్ష ముగుస్తుందని తెలుపుతుంది గరుడ పురాణం. వీరిని నపుంసకులు ఇబ్బంది పెడుతూనే ఉంటారట. ఇక చనిపోయిన వారి ఆత్మను యమకింకరులు వచ్చి తీసుకొని వెళ్తారట. ఆ తర్వాత 24 గంటలు గడిసిన తర్వాత ఆ వ్యక్తి బంధువులు, కుటుంబ సభ్యుల మధ్యలో వదిలి వెళ్తారట. కానీ ఎవరికి ఈ ఆత్మ కనిపించదు, వినిపించదట. కానీ ఆత్మ మాత్రం అందరిని పిలవడానికి, మాట్లాడడానికి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుందట.
కుటుంబ సభ్యులు ఏడుస్తున్నప్పుడు తాము చేసిన తప్పులను తలుచుకుంటూ ఆత్మ కూడా బోరున ఏడుస్తుంటుందట. యమకింకరులు ఆత్మను వదిలి పెట్టిన తర్వాత తిరిగి వెళ్లడానికి దానికి దారి తెలియదట. ఇక 11 రోజులు పిండ ప్రధాన కార్యక్రమాలు చేసే వరకు కూడా ఆత్మ అక్కడే తిరుగుతుంటుందట. ఆ తర్వాత యమలోకానికి దారి తెలుస్తుందట. ఇక ఒక ఆత్మ యమలోకానికి వెళ్లడానికి సంవత్సర కాలం పడుతుందట. అయితే మంచి పనులు చేసిన వారిని వెంటనే యమకింరులు వచ్చి త్వరగా నరకానికి తీసుకెళ్తారట. సంవత్సర కాలం పట్టదట.