Rajamouli: రాజమౌళి, ఆయన భార్య ఇద్దరు లవర్స్ గా ఉన్న టైమ్ లో ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటో తెలుసా..?

రాజమౌళి వాళ్ళ ఇంట్లో ఉండడంతో ఈమెతో ఆయనకి మంచి సన్నిహిత్యం ఏర్పడింది. ఇక దాంతో ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు.

Written By: Gopi, Updated On : March 26, 2024 4:48 pm

Rajamouli and Rama Rajamouli

Follow us on

Rajamouli: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.. ఇక అందులో భాగంగానే కొంతమంది దర్శకులు కూడా ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక అందులో ముఖ్యంగా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా రమా ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే రమా రాజమౌళిని పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని కార్తికేయ పుట్టిన తర్వాత అతన్ని వదిలేసింది.

ఇక ఆ క్రమంలోనే ఈమె రాజమౌళి వాళ్ళ ఇంట్లో ఉండడంతో ఈమెతో ఆయనకి మంచి సన్నిహిత్యం ఏర్పడింది. ఇక దాంతో ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. ఇక వీళ్ళ ప్రేమని పెళ్లిగా మార్చుకోవడానికంటే ముందే రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన రాసుకున్న ప్రతి కథను రమా కి వినిపించేవాడట. ఆమె ఆ స్టోరీ ఎలా ఉంది అనేది చెబుతూ దాంట్లో ఏం చేంజెస్ చేస్తే ఆ స్టోరీ ఇంకా బాగుంటుంది అనేది కూడా చెబుతూ ఉండేదట. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ఆమెకు అట్రాక్ట్ అయ్యాడు. ఇక దాంతో జక్కన్న ఆమెను లవ్ చేశాడు. ఇక ఆయన ప్రేమ విషయాన్ని తనతో చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ లవర్స్ గా ఉన్నప్పుడు తేజ డైరెక్షన్ లో వచ్చిన నువ్వు నేను సినిమాని ఎక్కువసార్లు థియేటర్ కెళ్ళి చూశారట.

ఆ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందనే ఉద్దేశ్యం తోనే వీళ్ళిద్దరూ ఆ సినిమాకి బాగా డీప్ గా కనెక్ట్ అయ్యారు. అలా వీళ్ళిద్దరూ ఆ సినిమా చూస్తూ విపరీతంగా ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నట్టుగా ఒక సందర్భంలో రాజమౌళి తెలియజేశాడు. ఇక మొత్తానికైతే వీళ్ళ బంధం అనేది పెళ్లితో ఒకటైంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగడం అంటే మామూలు విషయం కాదు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాజమౌళి పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యం తో భారీ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సినిమా సక్సెస్ సాధించాలని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…