When you get angry: కోపం వచ్చినప్పుడు వణుకు, భయం ఎందుకు వస్తుంది?

కోపంతో ఉన్నవారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటారు. చేతిలో ఏది ఉంటే దాన్ని విసిరేయడం, నేలకేసి కొట్టడం చేస్తుంటారు. కోపంలో వారిని వారు నియంత్రించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతకీ కోపం వచ్చిన వ్యక్తిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి

Written By: Swathi Chilukuri, Updated On : October 21, 2024 3:06 pm

When-you-get-angry

Follow us on

When you get angry: కోపం… మనిషిలో కనిపించే సాధారణ పరిస్థితి. నచ్చని పని చూస్తే చాలు కోపంతో చాలా ఊగిపోతుంటారు. ఆ టైమ్ లో భయంతో ఉన్నవారి, భయపెట్టే వారి ఇద్దరి కాళ్లు చేతులు కూడా గజగజ వణికుంతాయి. ఇది అందరి విషయంలో జరగదు. అయితే భయంతో వణికిపోవడం వేరు, కోపంతో వణికిపోవడం వేరు అంటున్నారు నిపుణులు. రెండింటికీ చాలా తేడా ఉంటుందట.

కోపంతో ఉన్నవారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటారు. చేతిలో ఏది ఉంటే దాన్ని విసిరేయడం, నేలకేసి కొట్టడం చేస్తుంటారు. కోపంలో వారిని వారు నియంత్రించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతకీ కోపం వచ్చిన వ్యక్తిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి. ఆవేశం వచ్చినప్పుడు మనుషులు ఎందుకు ఊగిపోతారు. వణికిపోతుంటారు.

కోపం వస్తే చేతులు, కాళ్లు ఎందుకు వణుకుతున్నాయి?

1. అడ్రినలిన్ హార్మోన్ విడుదల
కోపంగా ఉన్నప్పుడు శరీరం ఫైట్‌ మోడ్‌లోకి వెళ్తుంది. మెదడుకు సంకేతాలు వెళ్లడం కామన్. ఇలా వెళ్లిన ప్రతి చర్యగా ఆడ్రినలిన్ హార్మోన్‌ విడుదల అవుతుంది. అంటే ప్రతికూల చర్యగా అక్కడ ఉండి ఫైట్ చేయడమా లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడమా అనే స్థితిలో ఉంటుంది. కొందరు కోపం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరికొందరు అక్కడే ఉండి అవతలి వ్యక్తితో తలపడతారు. కోపంతో ఊగిపోతారు. దీనికి ఈ అడ్రినలిన్ హార్మోన్ ప్రధాన కారణం. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి స్థితి ఉంటుంది. శరీరం వణుకుతుంది, కాళ్లు చేతులు వణుకుతూ ఉంటాయి. అడ్రినలిన్ తక్కువగా ఉంటే గొడవ జరిగినప్పుడు కోపం వచ్చినప్పటికీ వ్యక్తి స్పాట్ నుంచి వెళ్లిపోతాడు. అంతే కానీ ఎదురు నిలబడి పోరాడే ధైర్యం చేయడు.

2. కండరాల ఒత్తిడి
కోపం సమయంలో కండరాలు బిగుసుకుపోతాయి. దీని వల్ల చేతులు, కాళ్లు, శరీరం వణుకుతాయి. కోపంతో నియంత్రణను కోల్పోయినప్పుడు ఇలా తరచుగా జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఏం చేస్తారో కూడా తెలియదు.

3. హృదయ స్పందన రేటు పెరుగుదల
కోపంలో హృదయ స్పందన కూడా పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. ఈ సమయంలో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది.దీంతో చేతులు, శరీరంలో ఓ విధమైన వణుకు వస్తుంది. గుండె కొట్టుకునే వేగం పెరగి శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. తద్వారా నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది.. ఆ టైంలో మెదడు ఆలోచన కోల్పోయి మనిషి ఏం చేస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.

4. ఒత్తిడి లేదా ఆందోళన
కోపం తరచుగా ఒత్తిడి, ఆందోళనతో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఒత్తిడిలో ఉన్నప్పుడు కోపంగా లేదా చిరాకుగా ఉండటం కూడా కామన్. అటువంటి స్థితిలో శరీరం ,చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి. మానసిక, శారీరక అలసట వల్ల కూడా ఇది జరగవచ్చు.

కోపంలో కాళ్లు, చేతులు వణుకులేకుండా ఎలా నియంత్రించాలి అనుకుంటున్నారా? అయితే మీకు కోపం వచ్చినప్పుడు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. కోపాన్ని, వణుకును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించండి. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజూ వ్యాయామం చేయడం దినచర్యగా మార్చుకోండి. ఈ సమయంలో నీళ్లు తాగడం మంచిది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..