https://oktelugu.com/

TGPSC Group 1 Exam : గ్రూప్‌–1 అభ్యర్థులకు సుప్రీం కోర్టులో చుక్కెదురు.. జోక్యానికి నిరాకరణ.. నెక్ట్స్ ఏం జరుగనుందంటే?*

గ్రూప్‌–1 అభ్యర్థుల చివరి ఆశలు కూడా ఆవిరయ్యాయి. పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29 రద్దు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కొద్ది మందికి.. నిరాశే మిగిలింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 21, 2024 3:00 pm
    TGPSC Group 1 Exam

    TGPSC Group 1 Exam

    Follow us on

    TGPSC Group 1 Exam :  తెలంగాణలో గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షలు సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షలు రీషెడ్యూల్‌ చేయాలని జీవో 29 రద్దు చేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఇదివరకే హైకోర్టు సింగిల్‌ బెంచ్, డివిజనల్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. పరీక్షల రీషెడ్యూల్‌కు హైకోర్టు నిరాకరించింది. దీంతో అభ్యర్థులు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. జీవో 29 రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఉందని, దానిని రద్దు చేసి గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 55 ప్రకారం నియామకాలు జరపాలని పటిషన్‌ వేశారు. దీనిపై సోమవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. జీవో 29తో రిజర్వుడు వర్గాలకు అన్యాయం జరుగుతుందని కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. విచారణ నేపథ్యంతో టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయితే వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత పరిస్థితిలో జోక్యం చేసుకోలేమని తెలిపింది.

    మధ్యంత ఉత్తర్వులకు నిరాకరణ..
    గ్రూప్‌–1 పరీక్షల వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయినా ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సుప్రీకోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇప్పటికే ప్రిలిమ్స్‌ పరీక్షలు ముగియడం, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున మధ్యంత ఉత్తరువ్లకు కూడా ధర్మాసంన నిరాకరించింది. నియామకాలు తుది తీర్పుకు లోబడే జరుగుతాయని స్పష్టం చేసింది. తుది ఫలితాలు వచ్చేలోగా ఫైనల్‌ తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సూచించింది.

    ఐదు నిమిషాల్లో ముగిసిన వాదనలు..
    ఇదిలా ఉంటే.. సుప్రీం కోర్టు విచారణను కేవలం ఐదు నిమిషాల్లోనే మిగించింది. హైకోర్టులో విచారణ జరుగుతున్నందున విచారణ చేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక పరీక్షలు జరుగుతున్న సమయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. దీంతో ఎన్నో ఆశలతో సుప్రీం తలుపు తట్టిన గ్రూప్‌–1 అభ్యర్థులకు చెక్కదురైంది. అయితే తుది తీర్పునకు లోబడే నియామకాలు జరుగతాయని, ఈమేరకు హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వడం ఒక్కటే అభ్యర్థులకు కాస్త ఊరటనిచ్చే అంశం.

    యథావిధిగా పరీక్షలు..
    సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించిన నేపథ్యంలో సోమవారం(అక్టోబర్‌ 21 నుంచి) షెడ్యూల్‌ ప్రకారం జరుగనున్నాయి. అక్టోబర్‌ 27 వరకు పరీక్షలు జరుగతాయి. ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌తో పరీక్షలు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు. 1:30 గంటల తర్వాత కేంద్రాల్లోకి అభ్యుర్థలను అనుమతించరు. ఇప్పటి వరకు కేంద్రాల బయట వేచిఉన్న అభ్యర్థులు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లోకి వెళ్తున్నారు.