Allu Arjun : ఎన్నికల సమయం నుండి నేటి వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ప్రచారాలకు చివరి రోజున అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కోసం నంద్యాలలోని అతని ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ పట్ల తీవ్రమైన అసంతృప్తిని వ్యక్త పరిచారు. ఇప్పటికీ దీని గురించి సోషల్ మీడియా చర్చలు, ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉన్నాయి. కాగా , అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్లిన సమయంలో సెక్షన్ 144,పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంది. అయితే ఆరోజున అల్లు అర్జున్ ని చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. సెక్షన్ 144 అమలులో ఉండగా రూల్స్ కి విరుద్ధంగా భారీగా జన సమీకరణ చేసారని, అల్లు అర్జున్ పై ఫిర్యాదు రావడంతో కేసు నమోదైంది.
అయితే రూల్స్ కి విరుద్ధం గా తానేమి జన సమీకరణ చేయలేదని కోర్ట్ కి ఆధారాలు చూపిస్తూ క్వాష్ పిటీషన్ ని దాఖా చేసాడు. ఈ నేపథ్యం లో ఆయన అమరావతి హై కోర్టుకి విచ్చేశాడు. అల్లు అర్జున్ పిటీషన్ ని స్వీకరించిన హై కోర్టు, రేపు ఈ కేసు ని విచారించనుంది. మరి అల్లు అర్జున్ అభ్యర్థన ని విచారించి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే ఎన్నికల సమయం తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ లోకి అడుగుపెట్టింది ఇప్పుడే. అల్లు అర్జున్ వస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు హై కోర్టు ప్రాంగణంలో పెద్ద ఎత్తున వచ్చారు. అల్లు అర్జున్ అభిమానుల నుండి తప్పించుకొని లోపలకు వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వం లో ‘పుష్ప 2’ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
2021 వ సంవత్సరం లో పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నందున అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్, కేవలం ఐటెం సాంగ్ తప్ప మొత్తం పూర్తి అయ్యింది. ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రద్దా కపూర్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. నవంబర్ మొదటి వారం లోపు ఈ పాత్ర చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ప్రారంభించి, రెండవ వారం లో మొదటి కాపీ సిద్ధం అయ్యేలా చూస్తున్నారు మేకర్స్. ఫస్ట్ హాఫ్ సంబంధించిన ఎడిటింగ్, రీ రికార్డింగ్ మొత్తం ఇప్పటికే పూర్తి అయ్యిందట.