Mrigasira Karthi 2023: మృగశిర కార్తె నేడు ఆరంభమైంది. దీంతో చేపలు తినాలని జనం ఎగబడుతున్నారు. ఎలాగైనా సరే మృగశిర రోజు మాంసాహారం తినాలని చూస్తుంటారు. ఇందులో భాగంగానే చేపలను తీసుకుంటారు. అందరు చేపలనే తినాలని చూస్తారు. ఈ రోజు ప్రతి ఇంట్లో చేపల కూర ఉండాల్సిందే. చేపల కూర తినాల్సిందే. ఏడాదికి కనీసం కిలో చేపల ముళ్లయినా కడుపులో పడాలట.
మృగశిర రోజు ఎక్కువగా చేపలు ఎందుకు తింటారు? ఇందులో ఉన్న రహస్యమేమిటి? అనే దానిపై అందరికి సందేహాలు ఉంటాయి. మృగశిర రోజు మాంసాహారం తినాలని చెబుతారు. కానీ ప్రజలు ఈ రోజు చేపలనే ఆహారంగా చేసుకుంటారు. మృగశిర కార్తె రోజు ఎందుకు చేపలు తింటారు. దాని వెనకున్న కారణాలు ఏమిటి అనే దానిపై తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం సహజమే.
మృగశిర కార్తెలో చేలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. వేసవి కాలం దృష్ట్యా ఎండలు మండిపోయే కాలం నుంచి మృగశిర కార్తె రావడంతో వాతావరణం చల్లగా మారుతుంది. ఈ సమయంలో వ్యాధులు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. వాతావరణం చల్లబడటంతో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో శరీరాన్ని వేడి చేసేందుకు చేపలను తినాలని పెద్దలు చెబుతుంటారు. అందుకే మృగశిర ప్రారంభం రోజు నుంచే చేపలు తినేందుకు ఇష్టపడతారు.
వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశమున్నందున రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు వీటిని తీసుకునేందుకు మొగ్గు చూపుతారు. వీటి నుంచి బయట పడేందుకు చేపలను తింటారు. మృగశిర కార్తె రోజు నీచు పదార్థం తినాలని చెబుతారు. దీంతోనే చేపలు తినడానికి ఇష్టపడతారు. చేపలు అందుబాటులో లేకపోతే చికెన్, కోడిగుడ్లు తినడం చేస్తుంటారు.
మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. మృగశిర రోజు చేపలు తినాలని పెద్దలు చెబుతున్నందున అందరు వాటిని తినాలని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే చేపలు తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తారు. చేపల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.