Political Leaders : దేశంలో ఎందరో రాజకీయ నాయకులు ఉంటారు. వీళ్లందరికి ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఎక్కువ శాతం మంది రాజకీయ నాయకులు (Political Leaders) తెల్లని (White Dress) దుస్తుల్లోనే కనిపిస్తారు. సర్పంచ్ నుంచి ప్రధాని వరకు అందరూ కూడా తెల్లని దుస్తుల్లోనే ప్రసంగాలు ఇస్తుంటారు. ఏ చిన్న మీటింగ్ అయినా కూడా వైట్ కలర్ డ్రస్‌లోనే ఉంటారు. కొందరు రాజకీయ నాయకులు (Political Leaders) వారి పార్టీ రంగు ఉన్న దుస్తులు ధరిస్తారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం తెల్లని దుస్తులే (White Dress) ధరిస్తారు. నిజానికి అన్ని రంగుల కంటే తెల్లని రంగుకి ఓ ప్రత్యేకత ఉంది. దీన్ని ఎంతో స్పెషల్‌గా ఉపయోగిస్తారు. చాలా మంది ప్రత్యేకమైన వ్యక్తిని కలిసేటప్పుడు ఎక్కువగా తెల్లని రంగు దుస్తులు ధరిస్తారు. ఇవి చాలా స్పెషల్‌గా ఉంటాయని నమ్ముతారు. మన దేశంలో స్కూల్ పిల్లలకు యూనిఫాం కూడా ఎక్కువగా తెల్లని దుస్తులే ఉంటాయి. ఇప్పుడంటే చాలా ప్రైవేట్ స్కూళ్లు వచ్చి యూనిఫాం దుస్తులను మారుస్తున్నాయి. కానీ గతంలో ఎక్కువగా తెలుపు రంగు దుస్తులే ఉండేవి. అసలు రాజకీయ నాయకులు తెల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు? దీనికి గల కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మన దేశంతో పోలిస్తే మిగతా దేశాల్లో రాజకీయ నాయకులు ఎక్కువగా నల్ల కోట్ ధరిస్తారు. కానీ మన దేశంలో మాత్రం తెల్లని దుస్తులనే కనిపిస్తుంటారు. అయితే దీని వెనుక ఓ కారణం ఉంది. ఒక్కో రంగుకి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లు తెలుపు రంగుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. శాంతి, స్వచ్ఛత, జ్ఞానానికి తెలుపు ప్రతీక. అందుకే రాజకీయ నాయకులు ఎక్కువగా తెలుపు దుస్తులను ధరిస్తారు. అలాగే తెలుపు రంగు దుస్తులు ధరించిన వారు ఎందరిలో ఉన్నా కూడా కనిపిస్తారు. మిగతా రంగులో పోలిస్తే తెలుపు దుస్తులు ధరించిన వారు స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తారు. తెలుపు దుస్తుల వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో బాపూజీ కూడా విదేశీ దుస్తులు కాకుండా స్వదేశీ ఖాదీ దుస్తులను వాడాలని నినాదం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి రాజకీయ నాయకులు తెల్లని దుస్తులను ధరిస్తున్నారు. రాజకీయ నాయకులు ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా ప్రజలను పాలించాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు తెల్లని కోట్‌ను ధరిస్తారు. తెల్లని దుస్తులను కేవలం రాజకీయ నాయకులే కాకుండా వైద్యులు కూడా వైట్ కోట్‌లు ధరిస్తారు. తెలుపును శాంతికి చిహ్నంగా భావించి ధరిస్తారు.