Hindi Language : ఈ ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. అయితే ఒక్కో దేశానికి ఒక్కో అధికారిక భాష (Official language) ఉంటుంది. మన ఇండియాకి హిందీ అనేది అధికారిక భాష. మన దేశంలో కూడా ఎన్నో భాషలు (Language) ఉన్నాయి. అందులో మొత్తం 22 భాషలను గుర్తించారు. భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష (Language) ఉంటుంది. అయితే మన దేశంలో ఎక్కువగా హిందీ, ఇంగ్లీషు మాట్లాడుతారు. మిగతా భాషలు ప్రాంతాన్ని బట్టి మాట్లాడుతారు. ప్రపంచ దేశాలు వేర్వేరుగా ఉండటం వల్ల వేర్వేరు అధికారిక భాషలు ఉంటాయి. అయితే హిందీ అధికార భాష అనేది కేవలం మన దేశానికి మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఇంకో దేశానికి కూడా ఉంది. అది కూడా ఆస్ట్రేలియా ఖండంలో ఓ దేశం హిందీని అధికార భాషగా గుర్తించింది. ఇంతకీ ఆ దేశం ఏది? అసలు అధికారిక భాషగా హిందీని ఎందుకు గుర్తించింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషకు గుర్తింపు రావడానికి 2006 జనవరి 10 నుంచి ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా గుర్తింపు లభిస్తుంది. అయితే ఆస్ట్రేలియా ఖండంలోని ఫిజీ అధికార భాష కూడా హిందీనే. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ సభ 1949 సెప్టెంబర్ 14న హిందీని అధికార భాషగా ఎంచుకుంది. అయితే1953లో తొలిసారిగా జాతీయ హిందీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే బయట దేశంలోని వాళ్లు హిందీని అధికార భాష చేయడానికి ముఖ్య కారణం ఫిజీ దేశం. ఇక్కడ ఉండే చెరకు పరిశ్రమలో పని చేయడానికి ఉత్తర భారత దేశాల నుంచి కార్మికులను తీసుకెళ్లారు. ఇలా ఫిజీలో భారతీయ కార్మికులు పెరిగారు. 19వ శతాబ్దంలో దాదాపుగా 37 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారు పెరిగారు. ఇలా ఫిజీలో అందరికి హిందీ రావడంతో అధికార భాష చేశారు.1970లో ఫిజీకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఫిజీ అధికార భాషగా గుర్తించారు. ఫిజీకి ఉన్న నాలుగు అధికారిక భాషల్లో హిందీ ఒకటి. హిందీని కేవలం మన దేశంలోనే కాకుండా ఫిజీలో కూడా ఎక్కువగా మాట్లాడతారు. ఈ హిందీని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.