Ram Pothineni Movie
Ram Pothineni : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కి యూత్, ఫ్యామిలీ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ప్రారంభంలోనే ‘దేవదాసు’, ‘రెడీ’, ‘కందిరీగ’, ‘మస్కా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి ఊర మాస్ సినిమా చేసి, కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మాస్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకున్నాడు. రామ్ కెపాసిటీ కి తగ్గ సినిమాలు ఈమధ్య పడడం లేదని, పడితే ఆయన స్టార్ హీరోల లీగ్ లోకి వెళ్తాడని విశ్లేషకులు సైతం అనేక సందర్భాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చిన సంగతి తెలిసిందే. కానీ డైరెక్టర్స్ ఈమధ్య వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలనే రామ్ తో తీస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే రామ్ కి నార్త్ ఇండియా లో మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యూట్యూబ్ లో ఈయన నటించిన సినిమాలను హిందీలోకి దబ్ చేసి కొత్తగా అప్లోడ్ చేస్తారు. కేవలం రామ్ సినిమాలను మాత్రమే కాదు, టాలీవుడ్ లో అందరి హీరోల సినిమాలను అలాగే దబ్ చేస్తారు. కానీ ఎవ్వరి సినిమాలకు రానంత వ్యూస్ కేవలం రామ్ సినిమాలకు మాత్రమే వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలలో స్కంద, డబుల్ ఇస్మార్ట్, హలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ, హైపర్, పండగ చేసుకో, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలు హిందీ లో దబ్ అయ్యాయి. ప్రతీ సినిమాకి 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కొన్ని సినిమాలకు అయితే ఏకంగా 400 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ వ్యూస్ ఇప్పటి వరకు రాకపోవడం గమనించాల్సిన విషయం. రామ్ హిందీ సినిమాలన్నిటికీ కలిపి వచ్చిన వ్యూస్ ఆధారంగా ఎంత డబ్బులు వచ్చి ఉంటుంది అనేది లెక్క వేస్తే, దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. అందుకే రామ్ రెమ్యూనరేషన్ కూడా తన ప్రతీ సినిమాకి 20 కోట్ల రూపాయలకు పైగా అడుగుతున్నాడు. ఆయన సినిమాలకు సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ మన స్టార్ హీరోలకంటే ఎక్కువ రేట్ కి అమ్ముడుపోతున్నాయి. నార్త్ ఇండియా లో ఆయనకి ఉన్నటువంటి ఈ క్రేజ్ ని చూస్తుంటే సరైన సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా రామ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడని బలమైన నమ్మకంతో చెప్తున్నారు ఆయన అభిమానులు.